China Bat Woman: వ్యాక్సిన్లు ఉన్నా కొత్త కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న చైనా వైరాలజిస్ట్… ‘గబ్బిలం మహిళ’ పేల్చిన బాంబు

ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కొత్త కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, అయితే ఆందోళన చెందవలసిన పని లేదని చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ అంటోంది. దీర్ఘకాలికంగా మనం ఈ వైరస్ తో సహజీవనం చేయడానికే సిద్దపడి ఉండాలని ఆమె సూచించింది.

China Bat Woman: వ్యాక్సిన్లు ఉన్నా కొత్త కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న చైనా వైరాలజిస్ట్... గబ్బిలం మహిళ పేల్చిన బాంబు
China Bat Woman

Edited By:

Updated on: Aug 11, 2021 | 5:27 PM

ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కొత్త కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, అయితే ఆందోళన చెందవలసిన పని లేదని చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ అంటోంది. దీర్ఘకాలికంగా మనం ఈ వైరస్ తో సహజీవనం చేయడానికే సిద్దపడి ఉండాలని ఆమె సూచించింది. కరోనా వైరస్ చాలా పెద్దదని, ఇది మ్యుటేట్ అవుతూనే ఉంటుందని ఆమె పేర్కొంది. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన ఈమెను ‘బ్యాట్ వుమన్’ (గబ్బిలం మహిళ) అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇందుకు కారణం 16 ఏళ్లుగా ఈమె గబ్బిలాలు ఉన్న గుహల్లోకి వెళ్లి రకరకాల జాతుల గబ్బిలాలను వూహాన్ లోని తన ల్యాబ్ కి తెచ్చి వాటిపై రీసెర్చ్ చేస్తుండటమే. వ్యాక్సిన్లు అనివార్యమే అయినా వైరస్ సోకకుండా అవి నివారించజాలవని, అయితే కేసుల తీవ్రత తగ్గుతుందని షీ జెంగ్లీ తెలిపింది. ఇన్ని పరిశోధనలు చేస్తున్నా చైనా తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్న సెటైర్లు కూడా వినబడుతున్నాయి. గత ఏడాది వరకు ఈ దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా ఉండగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారానికి ఈ దేశంలో కేసులు 7 నెలల గరిష్ట స్థాయికి చేరాయట. బీజింగ్ సహా అనేక నగరాల్లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుండగా టెస్టింగ్ ల్యాబ్ ల వద్ద మాత్రం చాంతాండంత క్యూలు కనిపిస్తున్నాయి. పలు పట్టణాల్లో వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి.

చైనాతో సహా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కేసులు తామర తంపరగా పెరుగుతున్నాయి. ఇక డెల్టా విషయానికి వస్తే..దీనిపై పరిశోధకులు ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ ఇతర వేరియంట్లపై కూడా వారు అధ్యయనం చేస్తున్నారు. కానీ వాటికన్నా ఇది ప్రమాదకరమైనదని, అసలు కరోనా వైరస్ లక్షణాలు కనబడడానికి 7 రోజులు పడితే.. డెల్టా లక్షణాలు రెండు..మూడు రోజుల్లోనే కనబడతాయని, అంటే నిరోధక వ్యవస్థ రెస్పాండ్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంటుందని వీరు సూత్రీకరిస్తున్నారు. డెల్టా ప్లస్ అతి శ్రీఘ్రంగా మ్యుటేట్ అవుతుందని, దీని అదనపు మ్యుటేషన్ వల్ల ఇమ్యూన్ ప్రొటెక్షన్ తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు.=గత జూన్ లో ఇండియాలో ఈ వేరియంట్ కనబడింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ajit Pawar: కర్ణాటకతో బార్డర్ వివాదం.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లేఖ..

Police Torture: పోలీస్‌ల అరాచకాలు తట్టుకోలేకపోతున్నానంటూ లేఖ రాసి యువకుడి సూసైడ్