నేపాల్ వరదల్లో 33 దేశాల పర్యాటకులు అదృశ్యం.. ఏయే దేశాల వారు ఎంతమంది అంటే..?

నేపాల్‌లో భోటేకోషి, త్రిశూలి నదుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 644 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ జాతీయ పర్యాటక బోర్డు వెల్లడించింది. వీరిలో 178 మంది భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఇప్పటివరకు 177 మృతదేహాలు వెలికితీశారు.

నేపాల్ వరదల్లో 33 దేశాల పర్యాటకులు అదృశ్యం.. ఏయే దేశాల వారు ఎంతమంది అంటే..?
Nepal Flash Floods

Edited By:

Updated on: Aug 27, 2026 | 4:52 PM

నేపాల్‌లో భోటేకోషి, త్రిశూలి నదుల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఇప్పటివరకు 644 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ జాతీయ పర్యాటక బోర్డు (ఎన్‌టీబీ) తెలిపింది. ఇందులో 517 మంది విదేశీయులు, 127 మంది నేపాలీయులు ఉన్నారు. రసువా, నువాకోట్ జిల్లాల్లోని ఈ వరదల కారణంగా 178 మంది భారతీయ పర్యాటకులు అదృశ్యమయ్యారు. మొత్తం 33 దేశాలకు చెందిన పర్యాటకులు గల్లంతయ్యారని బోర్డు వెల్లడించింది.

దేశాల వారీగా గల్లంతైన పర్యాటకుల వివరాలు

భారత్ – 178

అమెరికా – 65

ఉక్రెయిన్ – 53

మలేషియా – 51

ఆస్ట్రేలియా – 35

యూకే – 33

కెనడా – 25

నేపాల్ – 127

సింగపూర్ – 9

జర్మనీ – 8,

రష్యా – 8

లాట్వియా – 6,

సౌత్ ఆఫ్రికా – 6

జపాన్ – 5,

న్యూజిలాండ్ – 5

ఫ్రాన్స్ – 4

బెల్జియం – 3,

స్పెయిన్ – 3

ఇటలీ – 2,

ఐర్లాండ్ – 2,

కజకిస్తాన్ – 2,

నెదర్లాండ్స్ – 2,

పోర్చుగల్ – 2 ,

బెలారస్, బల్గేరియా, ఫిన్లాండ్, హంగేరి, ఇజ్రాయిల్, లిథువేనియా, ఫిలిప్పీన్స్, సెర్బియా, స్వీడన్ తదితర దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఆగస్టు 26న ఉదయం సుమారు 8:30 గంటలకు టిబెట్ వైపు నుంచి ఐస్, రాతి కుప్ప కూలిపోవడంతో భోటేకోషి, త్రిశూలి నదుల్లో భారీ ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. కైలాస్ మానసరోవర్ యాత్రికులు, గోసైన్‌కుండ తదితర ప్రాంతాలకు వెళ్తున్న పర్యాటకులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు సుమారు 177 మంది మృతదేహాలు బయటపడ్డాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..ప్రస్తుతం
నేపాల్ సైన్యం, పోలీసులు, టూరిస్ట్ పోలీసులు, స్థానిక అధికారులు సహా బహుళ ఏజెన్సీలు సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్, రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలు సమాచారం కోసం నేపాల్ టూరిజం బోర్డు హెల్ప్‌లైన్‌లు 1234, 1144, టూరిస్ట్ పోలీస్ నంబర్ 9851289445ను ఏర్పాటు చేశారు

భారీగా ఆస్తినష్టం

వరదల వల్ల సుమారు 40 కిలోమీటర్ల రహదారులు, వంతెనలు,13 హైడ్రోపవర్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టిబెట్ వైపు కూడా వందలాది మంది గల్లంతయ్యారని చైనా అధికారులు తెలిపారు. మొత్తం వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 1,500 వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us