Nepal Earthquake: భయపెడుతున్న వరుస భూకంపాలు.. నేపాల్‌లో 158కి చేరిన మృతుల సంఖ్య..

Nepal Earthquakes: నేపాల్‌ను వరుస భూకంపాలువణికిస్తున్నాయి. తాజా భూకంపంలో మృతుల సంఖ్య 158కు చేరుకుంది. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

Nepal Earthquake: భయపెడుతున్న వరుస భూకంపాలు.. నేపాల్‌లో 158కి చేరిన మృతుల సంఖ్య..
Nepal Earthquake

Updated on: Nov 04, 2023 | 9:00 PM

Nepal Earthquakes: నేపాల్‌ను వరుస భూకంపాలువణికిస్తున్నాయి. తాజా భూకంపంలో మృతుల సంఖ్య 158కు చేరుకుంది. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

నేపాల్ ఖట్మాండ్‌లో కూడా భూప్రకంపలు వణికించాయి. భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ సంతాపం ప్రకటించారు. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9వేల మందిని బలితీసుకుంది.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పుష్ప కుమార్‌ దహల్‌ ప్రచండ వైద్య బృందంతో కలిసి పర్యటించారు. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.

ప్రధాని మోదీ సంతాపం..

నేపాల్‌ భూకంపంపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. భూకంప మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..

భూకంపంతో జజర్‌కోట్‌ జిల్లాలోని నల్‌గఢ్‌ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్‌ సరితా సింగ్‌ చనిపోయారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న నివాసం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..