Webb Space Telescope: మూడు దశాబ్దాల కలకు టైం ఫిక్స్.. నేడే నింగిలోకి వెబ్‌ టెలిస్కోప్‌..

|

Dec 25, 2021 | 1:22 PM

NASA James Webb Space Telescope launch: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించబోతుంది. విశ్వంతారాళంలో అనేకానేక ప్రయోగాలు చేసి, తెలియని

Webb Space Telescope: మూడు దశాబ్దాల కలకు టైం ఫిక్స్.. నేడే నింగిలోకి వెబ్‌ టెలిస్కోప్‌..
Webb Space Telescope
Follow us on

NASA James Webb Space Telescope launch: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించబోతుంది. విశ్వంతారాళంలో అనేకానేక ప్రయోగాలు చేసి, తెలియని ఎన్నో రహస్యాల అంతు తేల్చిన నాసా సైంటిస్టులు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపుతున్నారు. గుండ్రటి గాజుముక్క ఆకారంలో ఉండే ఈ వెబ్‌ టెలిస్కోప్‌ ఇంకా గగనసీమలోకి వెళ్లక ముందే దీనికి గురించి పెద్ద చర్చ సాగుతోంది. అసలు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్నది తెలుసుకుందాం!

మిషన్ లా పనిచేసే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్‌కు సమయం దగ్గర పడుతోంది. గయానా స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయనున్నారు. దీని ద్వారా ఈ విశ్వంలోని రహస్యాలను ఛేదించాలన్నది సైంటిస్టుల ప్రయత్నం. ఓ రకంగా ఇది గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌లాంటిది. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్‌ ఇ.వెబ్‌ పేరునే దీనికి పెట్టారు. హబుల్‌ టెలిస్కోప్‌ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీనికి షార్ట్‌ ఫామ్‌లో ‘వెబ్‌’ అని పిలుచుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్‌ స్పేస్‌ అకాడమీ, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

భారత కాలమానం ప్రకారం..

క్రిస్మస్ సందర్భంగా ఖగోళ శాస్త్రవేత్తలు, స్కైవాచర్లకు నాసా ప్రత్యేక కానుకను ఇవ్వనుంది. దీనిని డిసెంబర్ 25 07:20 ఉదయం.. (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.50) స్పేస్ ఏజెన్సీ, అత్యంత శక్తివంతమైన స్పేస్ సైన్స్ టెలిస్కోప్ ఫ్రెంచ్ గయానా నుంచి ప్రారంభించనున్నారు.

Also Read:

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. వీరిని పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామి అదృష్టవంతులే..