వరుసగా మూడు ఉల్కలు.. భూమికి ముప్పెంత..?

| Edited By:

Dec 28, 2019 | 3:28 PM

ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు ఉల్కలు భూమికి దగ్గరగా రాబోతున్నాయి. వీటికి 2019 YS2, 2019 YX, 2019 YT2 అనే పేర్లను పెట్టారు. ఈ  మూడు ఉల్కలు ఈ వారాంతంలో భూమికి దగ్గరగా వెళ్లనున్నాయి. ప్రస్తుతం 2019 YS2 ప్రస్తుతం గంటకు 13వేల మైళ్ల వేగంతో, 2019 YX గంటకు 13,100 మైళ్ల దూరంతో, 2019 YT2 గంటకు 19వేల మైళ్ల దూరంతో భూకక్ష్యలో పయణిస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఉల్క భూమిని ఢీకొట్టే […]

వరుసగా మూడు ఉల్కలు.. భూమికి ముప్పెంత..?
Follow us on

ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు ఉల్కలు భూమికి దగ్గరగా రాబోతున్నాయి. వీటికి 2019 YS2, 2019 YX, 2019 YT2 అనే పేర్లను పెట్టారు. ఈ  మూడు ఉల్కలు ఈ వారాంతంలో భూమికి దగ్గరగా వెళ్లనున్నాయి. ప్రస్తుతం 2019 YS2 ప్రస్తుతం గంటకు 13వేల మైళ్ల వేగంతో, 2019 YX గంటకు 13,100 మైళ్ల దూరంతో, 2019 YT2 గంటకు 19వేల మైళ్ల దూరంతో భూకక్ష్యలో పయణిస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం లేదని.. దేని వలన భూమికి పెద్ద ముప్పు ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. కానీ ఈ ఉల్కల వలన అంతరిక్షంలో పేలుడు జరిగి అక్కడి వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. నాసా ప్రకారం 2019 YS2 డిసెంబర్ 28న రాత్రి గం.07.09ని.లకు(అమెరికా కాలమానం), 2019 YX డిసెంబర్ 29న రాత్రి గం.05.49ని.లకు, 2019 YT2 డిసెంబర్ 29 రాత్రి గం.11.05ని.లకు భూమికి దగ్గరగా రానున్నాయి. కాగా ఇటీవల భూమికి ఓ పెద్ద ఉల్క నుంచి ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే.