Shubhanshu Shukla: ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్లా… దాదాపు రెండు వారాలుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న శుభాంశు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. శుభాంశు శుక్లా.. దాదాపు రెండు వారాలుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 230 సూర్యోదయాలు చూసిన శుభాంశు.. 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. జూన్‌ 25న ఐఎస్‌ఎస్‌లో...

Shubhanshu Shukla: ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్లా... దాదాపు రెండు వారాలుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న శుభాంశు

Updated on: Jul 11, 2025 | 7:18 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. శుభాంశు శుక్లా.. దాదాపు రెండు వారాలుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 230 సూర్యోదయాలు చూసిన శుభాంశు.. 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. జూన్‌ 25న ఐఎస్‌ఎస్‌లో ల్యాండ్‌ అయిన శుభాంశు అనేక పరిశోధనలు చేస్తున్నారు. నాసా నుంచి క్లియర్‌ డైరెక్షన్స్‌ వెళ్లిన తర్వాత త్వరలోనే భూమికి తిరిగిరానుది శుభాంశు బృందం.

‘‘యాక్సియం-4 బృందం దాదాపు 230 సార్లు భూమిని చుట్టివచ్చింది. వారు ఆరు మిలియన్‌ మైళ్ల (96.5 లక్షల కి.మీ) కంటే ఎక్కువ ప్రయాణించారు. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉండి.. తీరిక సమయాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ సరదాగా గడిపింది. భూమిపై ఉన్న తమ ప్రియమైన వారితో సంభాషించడంతోపాటు మన గ్రహాన్ని వారి కెమెరాల్లో బంధించారు. రోజూవారీ బిజీ షెడ్యూల్‌ నుంచి ఇవి కాస్త ఉపశమనం కలిగిస్తాయి’’ అని యాక్సియం స్పేస్‌ ప్రకటించింది.

శుభాంశు టీమ్ అనేక ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటించింది. ఐఎస్‌ఎస్‌లో ఉంటూ ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహించింది శుభాంశు శుక్లా టీమ్‌. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి శుభాంశ్ వర్క్ ఉపయోగపడుతుంది. రోదసీలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని అధ్యయనం చేశారు. దీంతో… మున్ముందు ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాముల మనుగడ సరళతరం కానుంది.

అటు… నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొన్నారు. మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు… 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో ఇన్ని ప్రయోగాలు చేయడం ఒక రికార్డ్. భారత్‌ గగన్‌యాన్‌కు సైతం శుభాంశు మిషన్ ఉపయోగపడుతుంది. మధుమేహ నిర్వహణ, మెరుగైన క్యాన్సర్‌ చికిత్సలు, మానవ ఆరోగ్యం పర్యవేక్షణ పురోగతికి ఈ పరిశోధనలు కీలకంగా మారనున్నాయి.