Mystery Sea Creature: అత్యంత వికారమైన, భయంకరమైన చేప.. ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే..

ఈ చేపను ప్రపంచంలోనే అత్యంత వికారమైన జీవిగా పేర్కొంటారు. ఈ జీవి చాలా భయంకరంగా కనిపిస్తుంది.

Mystery Sea Creature: అత్యంత వికారమైన, భయంకరమైన చేప.. ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే..
Mystery Deep Sea Creature

Updated on: Jun 30, 2022 | 10:49 AM

Mystery Sea Creature: సముద్రం.. అంతులేని అద్భుతాలకు.. జీవరాశికి నెలవు. సముద్ర గర్భంలో అంతులేని జీవులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని జీవులు అకస్మాత్తుగా ప్రపంచం ముందుకు వస్తే.. వాటిని చూసి.. ప్రజలు విస్మయం చెందుతారు. ఇటీవల, అటువంటి వింత జీవి (Rare Sea Creature) ఆగ్నేయ ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. ఈ చేపను  ప్రపంచంలోనే  అత్యంత వికారమైన జీవిగా పేర్కొంటారు. ఈ జీవి చాలా భయంకరంగా కనిపిస్తుంది. జాసన్ మోయెస్..  ఒక ప్రొఫెషనల్ మత్స్యకారుడు, సిడ్నీకి దక్షిణాన 240 మైళ్ల దూరంలో ఉన్న తన స్వస్థలమైన బెర్మాగుయ్ తీరంలో రహస్య జీవిని పట్టుకున్నాడు. అతను వెంటనే ఈ వింత జీవిని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. మత్స్యకారుడు జాసన్ ఇప్పుడు ఈ జీవిని గుర్తించడంలో ప్రజల సహాయం కోరాడు. ఎందుకంటే అతనికి , చార్టర్ బోట్ కెప్టెన్‌కి ఈ జీవి ఏమిటో తెలియదు.

మత్స్యకారుడు జాసన్ ఫేస్‌బుక్‌లో చిత్రాన్ని పంచుకున్నాడు..  క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు, ‘ఇది బొచ్చు చేప కావచ్చని అనుకుంటున్నానని.. అందుకు పందెం వేస్తున్నానని చెప్పాడు. ఈ చేప బర్మాగుయ్ లోతైన నీటిలో పట్టుబడింది. ఇంత నీచమైన చేపను నేనెప్పుడూ చూడలేదు. వైరల్‌గా మారిన చిత్రంలో, చేప మచ్చలతో ఉంది. గులాబీ,గోధుమ రంగులో కనిపిస్తుంది. చేప కళ్ళు దాని  తల వైపుల నుండి బయటికి తిరిగి ఉన్నాయి. అదే సమయంలో దాని పెద్ద నోరు మొత్తం ముఖాన్ని కప్పివేసింది. దీనితో పాటు.. చేప దంతాలు చాలా పదునుగా ఉన్నాయి. ఈ పెద్ద చేప తన నోటితో మరో చేపను మింగడం కూడా చూడవచ్చు.

540 మీటర్ల లోతులో దొరికిన చేప

ఇవి కూడా చదవండి

4 కిలోల బరువున్న ఈ చేప 540 మీటర్ల లోతులో చిక్కుకుందని మత్స్యకారుడు జాసన్ న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు ఈ చేప చిత్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ చేప ఒక బొచ్చు చేప కావచ్చు అని మత్స్యకారుడు జాసన్‌తో అంగీకరిస్తున్నారు. అయితే చాలా మంది దీనిని మాంక్ ఫిష్ లేదా టోడ్ ఫిష్ అని అంటున్నారు. అయితే, కొంతమంది వినియోగదారులు దీనిపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ చేప చెడ్డ కల వంటిది అంటూ ఒకరు కామెంట్ చేశారు.

మరిన్ని అంతర్జాయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us