Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

|

Dec 17, 2021 | 11:23 AM

స్ ఇండియా-2020 మానస వారణాసి కరోనా బారిన పడింది. ఆమెతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు కొవిడ్‌ బారిన పడడంతో మిస్ వరల్డ్ - 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..
Follow us on

మిస్ ఇండియా-2020 మానస వారణాసి కరోనా బారిన పడింది. ఆమెతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు కొవిడ్‌ బారిన పడడంతో మిస్ వరల్డ్ – 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్‌ ప్రకారం మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే నిన్న (డిసెంబర్ 16) ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు పోటీదారులు, సిబ్బందితో కలిపి మొత్తం 17 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్‌ ఆర్గనైజర్లు ప్రకటించారు.

కాగా 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా- 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే ఇంతలోనే కరోనా బారిన పడింది. కాగా ఈ అందాల రాణికి మన భాగ్యనగరంతోనూ అనుబంధం ఉంది. హైదరాబాదులో ఎఫ్ఐఐటీ జేఈఈలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదివింది.