Microplastics: మనిషి గుండెలోకి చేరిన ప్లాస్టిక్ వ్యర్ధాలు.. 9 రకాల ప్లాస్టిక్ కణాల గుర్తింపు.. ప్రమాదం అంచున మానవులు అంటూ ఆందోళన

|

Aug 13, 2023 | 8:18 AM

ఆసుపత్రిలో 15 మంది రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు దర్యాప్తు బృందం చెబుతోంది. ఇలా  శస్త్రచికిత్స చేయడానికి ముందు, తరువాత రక్తం,గుండె కణజాల నమూనాలను తీసుకున్నారు. మైక్రోప్లాస్టిక్ కణాల పరిమాణం 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లు పరీక్షలో తేలింది. ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడంతో పాటు.. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో ఉంచిన ఆహారాన్ని తినడం ద్వారా మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వ్యర్ధాలు చేరినట్లు అనుమానిస్తున్నారు. 

Microplastics: మనిషి గుండెలోకి చేరిన ప్లాస్టిక్ వ్యర్ధాలు.. 9 రకాల ప్లాస్టిక్ కణాల గుర్తింపు.. ప్రమాదం అంచున మానవులు అంటూ ఆందోళన
Microplastics In Heaart
Follow us on

ప్లాస్టిక్ పర్యావరణానికి మాత్రమే కాదు.. మనిషి ఆరోగ్యానికి కూడా ముప్పే అని పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రకృతి నుంచి మానవ శరీరంలోకి చేరుకున్న ఈ ప్లాస్టిక్ ఆనవాలు.. రక్తం, తల్లిపాలల్లో కనుగొన్నారు.. అయితే ఈ  ప్లాస్టిక్ మానవ రక్తానికే పరిమితం కాలేదు. ఇప్పుడు మనిషి  హృదయానికి చేరింది. తొలిసారిగా మనిషి గుండెలో ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. ఈ విషయం చైనాలో వెలుగులోకి వచ్చింది. DailyMail నివేదిక ప్రకారం 15 మంది రోగుల్లో 9 రకాల ప్లాస్టిక్ కణాలు కనుగోన్నారు.  చైనాలోని బీజింగ్ అంజెన్ హాస్పిటల్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ 15 మంది రోగుల నుంచి రక్తం, గుండె కణజాల నమూనాలను తీసుకున్నారు. వైద్య పరిశోధనలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు నిర్ధారించారు.

మనిషి గుండెల్లో మైక్రోప్లాస్టిక్ చేరిన విషయం విస్మయం కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. మైక్రోప్లాస్టిక్ రోగుల గుండెకు ఎలా చేరిందో, వైద్యుల బృందం దాన్ని ఎలా గుర్తించిందో తెలుసుకుందాం..

మైక్రోప్లాస్టిక్ ఎలా గుర్తించారంటే..

ఆసుపత్రిలో 15 మంది రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు దర్యాప్తు బృందం చెబుతోంది. ఇలా  శస్త్రచికిత్స చేయడానికి ముందు, తరువాత రక్తం,గుండె కణజాల నమూనాలను తీసుకున్నారు. మైక్రోప్లాస్టిక్ కణాల పరిమాణం 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లు పరీక్షలో తేలింది. ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడంతో పాటు.. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో ఉంచిన ఆహారాన్ని తినడం ద్వారా మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వ్యర్ధాలు చేరినట్లు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మైక్రోప్లాస్టిక్‌లు గుండెకు ఎలా చేరాయి?

మైక్రోప్లాస్టిక్ రోగుల గుండెకు ఎలా చేరిందో అనే విషయంపై చేసిన పరిశోధన కోసం గుండె నుండి  రక్త నమూనా, కణజాలం తీశారు. అప్పుడు చేసిన పరిశోధనలో ఈ విషయం కనుగొనబడిందని వైద్యుల బృందం తెలిపింది. ఈ మైక్రోప్లాస్టిక్ శ్వాస ద్వారా లేదా ఆహారం లేదా నీటి ద్వారా శరీరంలోకి చేరిందని బృందం అభిప్రాయపడింది. రక్తంలోకి చేరిన తర్వాత, ప్లాస్టిక్ కణాలు RBCల బయటి పొరకు అంటుకుంటాయి. అవి శరీరానికి ఆక్సిజన్‌ను అందించడానికి పని చేస్తాయి. ఫలితంగా శరీరం పనితీరు దెబ్బతింటుంది.

క్యాన్సర్, గుండె దెబ్బతినడం నుండి జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం

ప్లాస్టిక్ రేణువులు ఎంత ప్రమాదకరమో, ఇది క్యాన్సర్, గుండె లోపాలు, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా కూడా దారితీస్తుందని బృందం చెబుతోంది. భవిష్యత్తులో ఇది నపుంసకత్వానికి కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ RBCలకు చేరిన తర్వాత కణాలు దానిని విచ్ఛిన్నం చేయలేవు. అవి మొత్తం శరీరానికి చేరి మంట, నష్టాన్ని కలిగిస్తాయి. అయితే మనుషులు తమకు తెలియకుండానే ప్రతివారం కొంతమొత్తంలో  మైక్రోప్లాస్టిక్స్ తింటున్నారని పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది.

9 రకాల ప్లాస్టిక్ కణాలు

పేషెంట్ల టెస్ట్ రిపోర్టులు షాకింగ్ గా ఉన్నాయి. రోగుల శాంపిల్స్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 రకాల ప్లాస్టిక్‌ కణాలు బయటపడ్డాయి. ఈ కణాలు లేజర్ , ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి.

మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే ఏమిటంటే..

గాజు వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సాధారణ ప్లాస్టిక్‌ను పాలీ ప్లాస్టిక్ కేటగిరీలో ఉంచారు. ఇందులోని సూక్ష్మ కణాలు మాత్రమే గుండెకు చేరుతున్నాయి. అంతేకాదు మరికొన్ని రకాల ప్లాస్టిక్ కణాలు కూడా కనుగొన్నారు. దీనిని సాధారణంగా టెరెఫ్తాలేట్ అంటారు. ఇవి ఆహార పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. మరోవైపు మరొక రకమైన ప్లాస్టిక్‌ను పాలీ వినైల్ క్లోరైడ్ అని వర్ణించారు. దీనిని విండో ఫ్రేమ్‌లు, డ్రైనేజ్ పైపులు, పెయింట్‌లో ఉపయోగిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..