చీజ్ బర్గర్‌లో ఎలుకల వ్యర్థాలు.. మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు..

|

May 05, 2023 | 2:35 PM

దీంతో షాక్‌కు గురైన మహిళ వినియోగదారుల ఫోరామ్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు దుకాణాన్ని సందర్శించి తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో దుకాణం అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన వ్యాజ్యం జిల్లా కోర్టులో జరుగగా ఈ రోజు తీర్పు వెలువడింది.

చీజ్ బర్గర్‌లో ఎలుకల వ్యర్థాలు.. మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు..
Mcdonald
Follow us on

ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు మెక్‌డొనాల్డ్స్‌పై కోర్టు రూ.5 కోట్ల జరిమానా విధించింది. అమెరికాలోని చికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాఖలను కలిగి ఉంది. ఇది బర్గర్‌లతో సహా ఫాస్ట్ ఫుడ్ వస్తువులను విక్రయిస్తుంది. ఈ క్రమంలోనే ఈస్ట్ లండన్‌లోని లేటన్‌స్టోన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌లో ఒక మహిళా కస్టమర్ 2021 సంవత్సరంలో ఎలుకల విసర్జన ఉన్న చీజ్‌బర్గర్‌ను కొనుగోలు చేసింది. దీంతో షాక్‌కు గురైన మహిళ వినియోగదారుల ఫోరామ్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు దుకాణాన్ని సందర్శించి తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో దుకాణం అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన వ్యాజ్యం జిల్లా కోర్టులో జరుగగా రెండేళ్ల తర్వాత మే 5న తీర్పు వెలువడింది.

దీని ప్రకారం ఆరోగ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మెక్ డొనాల్డ్ సంస్థ బాధితురాలికి సుమారు రూ.4.8 కోట్ల జరిమానా చెల్లించాలి. అలాగే, చట్టపరమైన చర్యల కోసం మహిళ చేసిన ఖర్చు రూ.22.6 లక్షలు కాగా, అదనంగా రూ.19,537 మొత్తం రూ.5 కోట్ల పెనాల్టీగా చెల్లించాల్సి ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..