
ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. మిండనావో ప్రాంతంలోని మనాయ్ పట్టణం వద్ద సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీన్ని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసి.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో నివసించే ప్రజలు వెంటనే ఎత్తైన లేదా దూర ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భూకంపం వల్ల నష్టం జరగవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది.
భూకంప కేంద్రానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతాలకు ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్ తీరంలోని కొన్ని చోట్ల సాధారణ అలల కంటే 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే ప్రమాదం ఉంది. ఇండోనేషియా, పలావు దేశాలకు కూడా చిన్న అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
భూకంపం చాలా బలంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ గవర్నర్ ఎడ్విన్ జుబాహిబ్ తెలిపారు. “కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని చెప్పారు. భూకంపం సమయంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదని.. ప్రజలంతా అధికారుల సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
ADVISORY: TSUNAMI WARNING
Tsunami Information No.1
Date and Time: 10 Oct 2025 – 09:43 AM
Magnitude = 7.6
Depth = 010 kilometers
Location = 07.07°N, 127.06°E – Offshore Davao Orientalhttps://t.co/ay0LB1g1yQ pic.twitter.com/Wo0s8CQ3hH— PHIVOLCS-DOST (@phivolcs_dost) October 10, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి