
భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న మాల్దీవుల పార్లమెంట్‌లో ఎంపీలు వీధిరౌడీల్లా కొట్టుకున్నారు. నలుగురు కొత్త మంత్రుల నియామకానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు గొడవ జరిగింది. ప్రెసిడెంట్ మహ్మద్ ముజీజ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టిన సమయంలో.. వాదనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. గొడవలో కొందరు ఎంపీలకు గాయాలయ్యాయి. వారిని ఎంపీలను ఆస్పత్రికి తరలించారు. అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్-PNC, ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ -PPM ఎంపీలు.. ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయిన్ డెమోక్రటిక్ పార్టీ-MDP ఎంపీల మధ్య గొడవ జరిగింది.
అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్‌లో నలుగురు మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నిరసనకు దిగారు. పోడియంపైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరికొందరు సభ్యులు అక్కడికి చేరుకుని స్పీకర్ తోపాటు అక్కడున్న సభ్యులతో వాగ్వాదానికి దిగారు.
ކެނދިކުޅުދޫ ދާއިރާގެ މެމްބަރު އީސާގެ ފައިގައި ހިފައި ކަނޑިތީމު މެމްބަރު ޝަހީމް ވައްޓާލާ މަންޒަރު. އެމްޑީޕީ ދޫކޮށް ޕީއެންސީއާ ގުޅުނު ސަރުކާރުގެ މެމްބަރުން މަޖިލީހަށް ހުރަސް އެޅުމާއެކު ތަޅުމުގައި ހަމަނުޖެހުން އަންނަނީ ހިނގަމުން. pic.twitter.com/mnmzvYKsrO
— Adhadhu (@AdhadhuMV) January 28, 2024
ఈ క్రమంలో పీఎన్‌సీ ఎంపీ షహీమ్.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. దీంతో ఇసా… షహీమ్ మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు గొడవను శాంతింపచేసేందుకు యత్నించారు. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మంత్రివర్గంలో మంత్రులకు ఆమోదం తెలపని ప్రతిపక్షాలు స్పీకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ދާދިފަހުން އެމްޑީޕީ ދޫކޮށް ޕީއެންސީއަށް ބަދަލުވި މެމްބަރުން ރިޔާސަތުގައި އިންނެވި މަޖިލީހުގެ ރައީސް މުހައްމަދު އަސްލަމަށް ޖަލްސާ ކުރިއަށްގެންދިޔުމުގެ ފުރުސަތު ދީފައި ނުވޭ. މުޅި ތަޅުމުން އިވެނީ ދުންމާރީގެ އަޑު. pic.twitter.com/1yv0wCNEAP
— Adhadhu (@AdhadhuMV) January 28, 2024
కెబినెట్‌లో మంత్రులకు ఆమోదం తెలపకపోవటం ప్రజాసేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ మండిపడుతోంది. మొత్తంగా ఎంపీల తోపులాట, ముష్టిఘాతలతో మాల్దీవుల పార్లమెంటు అట్టుడికింది.
*Viewer discretion advised*
Parliament proceedings have been disrupted after clashes between PPM/PNC MPs and opposition MPs. pic.twitter.com/vhvfCBgQ1s
— Adhadhu (@AdhadhuMV) January 28, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..