Italy Gandhi Statue: మోదీ టూర్‌కు అనుహ్య ఘటన.. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు

|

Jun 12, 2024 | 9:25 PM

ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల ఆగడాలు ఇటలీకి విస్తరించాయి. జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఇటలీకి వెళ్తున్న సమయంలో గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్‌ మద్దతుదారులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై విదేశాంగశాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

Italy Gandhi Statue: మోదీ టూర్‌కు అనుహ్య ఘటన..  గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు
Italy Gandhi Statue
Follow us on

ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల ఆగడాలు ఇటలీకి విస్తరించాయి. జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఇటలీకి వెళ్తున్న సమయంలో గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్‌ మద్దతుదారులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై విదేశాంగశాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. కెనడాలో గతంలో విధ్వంసం సృష్టించిన ఖలిస్తాన్‌ వాదులు ఈసారి ఇటలీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం దిమ్మె మీద ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారు. ఈనెల 13వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇటలీలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అపులియా ప్రాంతంలో జరిగే జీ7 సమావేశాలకు మోదీ హాజరవుతారు.

నరేంద్ర మోదీ పర్యటన వేళ ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటలీ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని కోరింది. గాంధీ విగ్రహం దిమ్మె మీద ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి. ప్రధాని పర్యటనకు ముందు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫొటోలు బయటపడ్డాయి. ఈ ఫొటోల్లో గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతోపాటు విగ్రహం కిందిభాగంలో ఖలిస్తానీ మద్దతు తెలుపుతున్న నినాదాలు కనిపిస్తున్నాయి.

ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ లేవనెత్తిందని, విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ అంశంపై ఇటలీ అధికారులతో మాట్లాడామన్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో జరుగుతుంది. జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరుకానున్నారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ప్రధానమంత్రి వెంట ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…