Israel Palestine War: యుద్ధంతో రాసిన ప్రేమకథ.. పెళ్లి నుంచి నేరుగా దేశం కోసం..

|

Oct 11, 2023 | 11:56 AM

మంగళవారం అందిన సమాచారం మేరకు.. ఈ యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్‌ల సంఖ్య 1,000 దాటిందని, 2,400 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. కనీసం 150 మందిని హమాస్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ హమాస్‌పై ప్రతీకార దాడులను ప్రారంభించడంతో, హమాస్ బందీలను చంపేస్తానని బెదిరించింది.

Israel Palestine War: యుద్ధంతో రాసిన ప్రేమకథ.. పెళ్లి నుంచి నేరుగా దేశం కోసం..
Love Amidst
Follow us on

హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో అత్యవసర యుద్ధ పరిస్థితి తలెత్తింది. దీంతో ఇజ్రాయెల్ హడావిడిగా తన సైన్యాన్ని పిలిచింది. హమాస్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్‌ అదనంగా 3 లక్షల రిజర్వు సైనికులను మళ్లీ సైన్యంలోకి రమ్మని ఆదేశించింది. ఈ సమయంలో, ఇద్దరు సైనికులు తమ యూనిట్‌లకు తిరిగి వెళ్లడానికి ముందు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత శనివారం హమాస్ చేసిన ఆకస్మిక దాడి మొత్తం ఇజ్రాయెల్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ చేసిన నిరంతర బాంబు దాడుల కారణంగా, 2 మిలియన్ల జనాభా ఉన్న గాజా భవనాల సముదాయం ఇప్పుడు స్మశానవాటికగా మారడం ప్రారంభించింది. ఎక్కడ చూసినా శవల దిబ్బలు, కూలిల భవన శిథిలాలు, ధ్వంసమైన వాహనాలు, ఆస్తులతో పాటు మొత్తమంతా ఆకాశం ఎత్తుకు కమ్మేసిన పొగలు మాత్రమే కనిపిస్తున్నాయి.

హమాస్ దాడి తర్వాత యుద్ధం తప్పదని తెలిసిన వెంటనే.. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని హుటాహుటినా వెనక్కి రావాలని పిలిచింది. అందులో సెలవులో ఉన్న సైనికులు కూడా తిరిగి రావాలని ఆదేశించారు. Uri Mintzer , Elinor Yosefin అనే ఇద్దరినీ కూడా విధులకు హాజరుకావాలని పిలిచిన వేలాది మంది ఇజ్రాయెలీ మిలిటరీ రిజర్విస్ట్‌లలో ఉన్నారు. వారు తమ సంబంధిత యూనిట్లకు వెళ్లే ముందు ఆదివారం రాత్రి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. పోస్టింగ్‌కి వెళ్లేలోపు ఇంటికి చేరుకుని రాత్రికి రాత్రే పెళ్లి చేసుకున్నారు ఆ ఇద్దరూ.

ఇవి కూడా చదవండి

300,000 మంది రిజర్విస్ట్‌లను విధుల కోసం మోహరించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి సోమవారం తెలిపారు. IDF ఇంత త్వరగా చాలా మంది రిజర్విస్ట్‌లను సమీకరించలేదు – 48 గంటల్లో 300,000 రిజర్విస్ట్‌లు విధుల్లో చేరినట్టుగా హగారి చెప్పారు.

వివాహానికి హాజరైన రబ్బీ డేవిడ్ స్టేవ్ మాట్లాడుతూ, “యుద్ధానికి వెళ్లే ముందు ఒక జంట వివాహం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ వివాహం ఈ జంట అనుబంధాన్ని వారి ప్రేమకున్న బలానికి నిదర్శనం అన్నారు. వారు పోరాడుతున్న దేశం, ఇల్లు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఇంత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నప్పటికీ వారిద్దరూ యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చాక గ్రాండ్‌గా జరుపుకుందామని వారికి వారు ధైర్యం చెప్పుకున్నారు.

మంగళవారం అందిన సమాచారం మేరకు.. ఈ యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్‌ల సంఖ్య 1,000 దాటిందని, 2,400 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. కనీసం 150 మందిని హమాస్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ హమాస్‌పై ప్రతీకార దాడులను ప్రారంభించడంతో, హమాస్ బందీలను చంపేస్తానని బెదిరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..