1700 Crore Lottery: ఓ యువతిని వెంటాడిన దురదృష్టం.. కొన్ని రూపాయల కారణంగా 1700 కోట్ల విలువైన లాటరీ మిస్

|

Jun 19, 2022 | 5:44 PM

ఓ మహిళకు విధి సాయం చేసి ఉంటే ఈరోజు రూ.1700 కోట్లు ఆమె సొంతమయ్యేవి. ఈరోజు కోట్ల రూపాయలకు అధిపతిగా మారేది.

1700 Crore Lottery: ఓ యువతిని వెంటాడిన దురదృష్టం.. కొన్ని రూపాయల కారణంగా 1700 కోట్ల విలువైన లాటరీ మిస్
Lottery
Follow us on

1700 Crore Lottery: మన జాతకం బాగుండి..  అదృష్టం చెంత ఉంటే .. చిన్న విషయాలు కూడా గొప్ప విజయాన్ని అందిస్తాయి. కూటికి లేని కటిక పేద కూడా క్షణ కాలంలో కోటీశ్వరుడు అవుతాడు. అదే విధి వక్రీకరించి.. గ్రహాలు అనుకూలంగా లేకుండా మనకు ఎదురు తిరిగితే..ఒంటరిగా కూర్చున్నా తాడే పామై కరచిపోతుంది. ఒక్కోసారి అంతా సవ్యంగా సాగిపోయినా.. లక్ లేకుంటే మన చేతిలో ఉన్న మంచి వస్తువులు కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటి ఒక ఘటన ఇప్పుడు బ్రిటన్‌లో ( Britain ) జరిగింది. ఓ మహిళకు విధి సాయం చేసి ఉంటే ఈరోజు రూ.1700 కోట్లు ఆమె సొంతమయ్యేవి. ఈరోజు కోట్ల రూపాయలకు అధిపతిగా మారేది.  19 ఏళ్ల రాచెల్ కెన్నెడీ దగ్గర కొంత డబ్బు ఉంటే.. ఓ  లాటరీ ద్వారా వేల కోట్లకు యజమానురాలు అయ్యేది.

బ్రిటన్‌లోని జరిగిన ఈ ఉదంతాన్ని ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం..  రాచెల్ కెన్నెడీ, ఆమె బాయ్‌ఫ్రెండ్ లియామ్ మెక్‌క్రోహన్‌తో కలిసి గత కొన్ని వారాలుగా యూరో మిలియన్ల కోసం టిక్కెట్లు కొనుగోలు చేస్తుంది.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ యువతి ఎప్పుడూ ఒకే నంబర్ లాటరీ టిక్కెట్‌ను ఎంచుకునేది. ఇలా చేయడం వలన ఏదో ఒకరోజు తనకు కచ్చితంగా లాటరీ తగులుతుందని ఆశించింది.

రూ. 1734 కోట్లకు పైగా లాటరీ
రాచెల్, లియామ్ ఒకే సిరీస్ నంబర్‌లపై (6, 12, 22, 29, 33, 6 మరియు 11) కలిసి పందెం వేశారు. ఈసారి రాచెల్,  ఆమె భాగస్వామి కలిసి 182 మిలియన్ పౌండ్ల (రూ. 1734 కోట్లకు పైగా) లాటరీని గెలుచుకున్నారు. ఈ వార్త తెలియగానే రాచెల్ ఆనందంతో ఎగిరి గంతేసి తన భాగస్వామి లియామ్, తల్లితో కలిసి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం ప్రారంభించింది. మొదట..  రాచెల్ తను పందెం వేసే అదే నంబర్‌పై £182 మిలియన్ లాటరీని గెలుచుకున్నట్లు నమ్మలేదు. దీన్ని ధృవీకరించుకోవడానికి ఆమె EuroMillions ఆఫీస్ కు కాల్ చేసింది. అయితే రాచెల్ ఓ షాకింగ్ వార్తను వింది.

ఇవి కూడా చదవండి

నిజానికి, EuroMillions కార్యాలయంలోని వ్యక్తులు రాచెల్ లాటరీ నంబర్‌పై ఆడారని.. అయితే రాచెల్ ఆ బహుమతిని పొందలేకపోయిందని చెప్పారు. ఎందుకంటే రాచెల్ ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసే సమయంలో.. ఆమె ఖాతాలో 238 యూరోలు ఉన్నాయి. కానీ ఆ లాటరీ టికెట్ కొనుగోలుకు 240 యూరోలు కావాలి. రివార్డ్ పొందిన నంబర్ టిక్కెట్‌ను రాచెల్ కొనలేకపోయింది. అంత పెద్ద లాటరీ ఆమె చేతిలో నుండి జారిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..