Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు గట్టి షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు.!

| Edited By: Ravi Kiran

Jul 22, 2022 | 9:43 PM

బ్రిటన్ ప్రధాని పదవీకి అడుగుదూరంలో రిషి సునాక్‌కు పెద్ద షాక్ తగిలింది..అత్యధిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓట్లతో...

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు గట్టి షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు.!
Rishi Sunak
Follow us on

బ్రిటన్ ప్రధాని పదవీకి అడుగుదూరంలో రిషి సునాక్‌కు పెద్ద షాక్ తగిలింది..అత్యధిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓట్లతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అనుకున్నారు..కానీ ఇప్పుడు సీన్ రివర్స్‌ అయినట్లు బ్రిటన్‌ ‘యూగోవ్’ సంస్థ సర్వే చెబుతోంది. ఐదో రౌండ్‌లోనూ విజయం సాధించి ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్న రిషికి ఇలా ఝలక్ ఇచ్చారు ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌..కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి, లిజ్‌ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్‌ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్‌ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది..దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్‌ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు.బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది.