టైర్‌ ఊడిపోయినా గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

| Edited By: Ravi Kiran

Oct 13, 2022 | 2:36 PM

చక్రం లేకుండానే వేల కిలోమీటర్లు ప్రయాణించిన విమానం.. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

టైర్‌ ఊడిపోయినా గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో
Boeing Aircraft
Follow us on

గేర్ టైర్ ఊడిపోయిన విమానం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అట్లాస్ ఎయిర్ నిర్వహిస్తున్న బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్‌ను కోల్పోయింది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విడిభాగాలను రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించిన జెయింట్ ఎయిర్‌క్రాఫ్ట్, టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్‌ ఊడిపోయింది. అయినా అది అలాగే గాల్లోకి లేచింది. దిగాల్సిన ఎయిర్‌పోర్టు రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇలాంటి ఊహించని పరిణామం ఇటలీలోని ఓ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.  విమానం గాల్లోకి ఎగరగానే దాని చక్రం ఊడి కిందపడిపోయింది. చక్రం లేకుండానే వేల కిలోమీటర్లు ప్రయాణించిన విమానం.. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బోయింగ్‌ 747 డ్రీమ్‌లిఫ్టర్‌ విమానం ఇటలీలోని టరాన్టో నుంచి అమెరికాలోని చార్లెస్టన్‌కు బయలుదేరింది. విమానం రన్‌వే పై నుంచి గాల్లోకి ఎగరగానే పొగ రావడం ప్రారంభమైంది. చూస్తుండగానే ఒక్కసారిగా దాని చక్రం ఊడి కిందపడిపోయింది. దీంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భయంతో వణికిపోయారు. విమానం ల్యాండింగ్‌పై విమానాశ్రయ అధికారుల్లో ఆందోళన మొదలైంది. చక్రం లేకుండానే ఆ విమానం వేల కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు సురక్షితంగా గమ్య స్థానానికి చేరింది. విమానం అమెరికాలో సేఫ్‌గా ల్యాండ్‌ అయినట్లు బోయింగ్‌ తెలిపింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి