ఎట్టకేలకు బయటకు వచ్చిన కిమ్.. కూతురితో కలిసి సైనిక కవాతులో.. నెక్ట్స్‌స్టెప్ పై ఊహాగానాలు

|

Feb 10, 2023 | 8:41 PM

కిమ్ జోంగ్ ఉన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లు సమాచారం.

ఎట్టకేలకు బయటకు వచ్చిన కిమ్.. కూతురితో కలిసి సైనిక కవాతులో.. నెక్ట్స్‌స్టెప్ పై ఊహాగానాలు
Kim Jong Un
Follow us on

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తన కుటుంబ సమేతంగా సైనిక కవాతుకు హాజరయ్యారు. చాలా కాలంగా బహిరంగంగా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ తన భార్య, కుమార్తెతో కలిసి ప్రజల ముందుకు వచ్చారు. దీంతో ప్రోగ్రామ్ మొత్తం కిమ్ వెంట ఉన్న కూతురే తదుపరి వారసురాలు కానుందన్న చర్చ బలపడింది. క్షిపణి కవాతును వీక్షించి, సీనియర్ సైనిక అధికారులతో కలిసి భోజనం చేసిన కిమ్ తన కుమార్తె, భార్యతో కలిసే ఉన్నారు.

నిన్న జరిగిన మిలటరీ డ్రిల్ లు.. కిమ్ కూతురు అణ్వాయుధ దాడులు చేసే సామర్థ్యం ఉన్న ఉత్తర కొరియాను పాలించే స్థాయికి చేరుకుంటుందని సంకేతాలు అందజేస్తున్నాయి. దీనికి ముందు రోజు, కిమ్, అతని భార్య, కుమార్తె సైనిక సిబ్బందితో కలిసి కూర్చుని వైన్ తాగుతున్న చిత్రాలను జాతీయ మీడియా ప్రసారం చేసింది. తన కూతురితో కలిసి బహిరంగ వేదికపై కిమ్ కనిపించడాన్ని కేవలం తండ్రీకూతుళ్ల అనుబంధంగా మాత్రమే చూడలేమని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు.

సియోల్‌లోని హాంకుక్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల విభాగంలో ప్రొఫెసర్ మాసన్ రిట్చీ మాట్లాడుతూ, సైనిక కసరత్తులు తదుపరి వారసునికి స్పష్టమైన సంకేతాలని చెప్పారు. ఆయుధాలతో సహా దేశం ఆయుధాల ప్రదర్శనలలో తన కుమార్తె పాల్గొనడం వికేంద్రీకరణపై చర్చను తటస్థీకరిస్తుంది అని మాసన్ రిట్చీ వివరించాడు.

కిమ్ జోంగ్ ఉన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లు సమాచారం. కేవలం 39 ఏళ్లు వయస్సున్న కిమ్‌పై తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయని, సియోల్‌కు చెందిన ఉత్తర కొరియా విద్యావేత్త డా. చోయ్ జిన్‌వూక్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఉన్ చాలా ఒంటరిగా, ఒత్తిడిలో ఉన్నారని పేర్కొన్నాడు. వైద్యులు, అతని భార్య ఉత్తర కొరియా నియంతకు వైద్యం, వ్యాయామం చేయాలంటూ చెప్పారు. కానీ అతను వాటిని పాటించడు. తన ఆరోగ్యం బాగోలేదని కిమ్ చాలా ఆందోళన చెందుతున్నారని, ఆరోగ్య సమాచారం బయటకు రాకుండా ఉండటానికి విదేశీ పర్యటనలలో తన సొంత టాయిలెట్‌తో ప్రయాణిస్తున్నారని నివేదిక వివరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..