జో బైడెన్‌కు భద్రత పెంపు.. సీన్‌లోకి సీక్రెట్‌ ఏజెంట్స్‌

|

Nov 07, 2020 | 7:15 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారులు – జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు ఆయన ఉండే డెలావర్‌ స్టేట్‌కు తరలివెళ్లారు. ఫలితాలు ఆయనకు అనుకూలంగా వస్తుండటంతో – భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ హడావుడి చూస్తుంటే బైడెన్‌కు అమెరికా అధ్యక్షుడి కళ వచ్చేసినట్టుంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా […]

జో బైడెన్‌కు భద్రత పెంపు.. సీన్‌లోకి సీక్రెట్‌ ఏజెంట్స్‌
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారులు – జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు ఆయన ఉండే డెలావర్‌ స్టేట్‌కు తరలివెళ్లారు. ఫలితాలు ఆయనకు అనుకూలంగా వస్తుండటంతో – భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ హడావుడి చూస్తుంటే బైడెన్‌కు అమెరికా అధ్యక్షుడి కళ వచ్చేసినట్టుంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుంచే బైడెన్‌ వెంట సీక్రెట్‌ సర్వీస్‌ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా అంటోంది. ఎన్నికల రోజున బైడెన్‌ వాహన కాన్వాయ్‌కి కూడా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.