ఇదేం రూల్ బాబోయ్ ? రెండు నిముషాలు ముందుగా ఆఫీస్ వదిలితే పేమెంట్ కట్ అట ! జపాన్ ఆఫీసుల్లో ‘చండశాసనులు’ !

| Edited By: Phani CH

Mar 18, 2021 | 7:02 PM

సాధారణంగా ఆఫీసుల్లో ఎనిమిది లేదా తొమ్మిది గంటలు ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అయితే కాస్త అటూఇటుగా చాలామంది ...

ఇదేం రూల్ బాబోయ్ ? రెండు నిముషాలు ముందుగా ఆఫీస్ వదిలితే పేమెంట్  కట్ అట ! జపాన్ ఆఫీసుల్లో చండశాసనులు !
Japanese Govt. Employees  Punished
Follow us on

సాధారణంగా ఆఫీసుల్లో ఎనిమిది లేదా తొమ్మిది గంటలు ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అయితే కాస్త అటూఇటుగా చాలామంది …మాకు పని ఉందనో, ఇల్లు చాలా దూరం ఉందనో చెప్పి నిర్ణీత వేళకన్నా కాస్త ముందుగానే  ఆఫీసులు వదిలి ఇళ్లకు బయల్దేరుతుంటారు. కానీ జపాన్ లో  మాత్రం ఇక  ఈ దిలాసా కుదరదు. ఆఫీసు వేళ నిర్ణేత సమయానికన్నా 2 నిముషాలు ముందుగా వెళ్ళిపోతే ఆ ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తారట; ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇలాంటి రూల్ పెట్టడం విశేషం. ఇలా వెరైటీ శిక్ష విధిస్తున్నారు. ఇప్పటికే ఈ విధమైన ‘చండశాసన’ నిబంధనను అమల్లోకి తెచ్చారు. రెండు నిముషాలు ముందు గానే వెళ్తారా/ కుదరదంటే కుదరంతే ! వెళ్తే వెళ్ళండి, శాలరీ కట్ ‘శిక్ష’ను మాత్రం ఎదుర్కొండి అంటున్నాయి అక్కడి ఆఫీసులు. ఫ్యునాబషీ సిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కార్యాలయంలో ఈ కొత్త నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. 2019 మే-ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో  ఉద్యోగులు 300 కి పైగా ‘తొందరబాటుగా  వెళ్లిన’ లాగ్స్ రికార్డయ్యాయట. త్వరగా వెళ్లేందుకు చాలామంది సిబ్బంది  తమ కార్డుల్లో తప్పుడు టైమింగ్స్ రాశారని ఈ సంస్థ యాజమాన్యం కనుగొంది. ఈ విషయంలో జూనియర్ సిబ్బంది కన్నా సీనియర్ ఉద్యోగులు ముందున్నారట. ఇందుకు ఉదాహరణగా  59 ఏళ్ళ ఓ మహిళా ఉద్యోగినికి  వచ్ఛే మూడు నెలలకు ఆమె శాలరీలో కొంత కట్ చేస్తామని యాజమాన్యం చెబుతోంది. సాయంత్రం 5 గంటల 15 నిముషాల వరకు ఆఫీసులో ఉండాల్సిన ఆమె..ప్రతి రోజూ  రెండు నిముషాలు ముందుగా ఆఫీసు వదులుతోందని కనుగొన్నారు. తనకు ఇంటికి వెళ్లే బస్సు 5 గంటల 17  నిముషాలకు కదులుతుంది  మరి..అందుకే ఆ బస్సు ఎక్కేందుకు ఆమె జస్ట్ 2 మినిట్స్ ముందుగా వెళ్ళిపోతోంది.

ఇక మరో ఇద్దరు సీనియర్ ఉద్యోగులను  యాజమాన్యం రాతపూర్వకంగా హెచ్చరించింది.  మరో నలుగురికి గట్టి వార్నింగులు ఇచ్చింది.2018 లో ఓ ఉద్యోగి లంచ్ బ్రేక్ కి మూడు నిముషాలు ముందుగా వెళ్లినందుకు అతనిపై చర్య తీసుకున్నారు. దీనికి విరుద్ధంగా స్పెయిన్ లో వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: EPFO Customers Alert: మీరు పీఎఫ్ ఖాతాదారులా.? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.!

800 Year Old Temple : 800ఏళ్ల చరిత్ర కలిగిన శైవ క్షేత్రం.. నలభై ఒక్క ప్రదక్షిణలతో కోరికలు తీర్చే రుద్రేశ్వరాలయం