సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ప్రయత్నాలలో శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. భవిష్యత్తులో ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని పొందేందుకు ఈ విధానం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్‌పై లండన్‌లో జరిగిన మూడవ అంతర్జాతీయ సమ్మిట్‌లో ఈ కీలక పురోగతిని.. జపాన్ శాస్త్రవేత్తలు సమర్పించారు.తొలుత మగ ఎలుక చర్మ కణాలను తీసుకున్నారు. ఇండ్యూస్డ్ ప్లూరీపొటెంట్ స్టెమ్ కణాలను సృష్టించేందుకు ఆ చర్మకణాలను మూలకణాల స్థితికి చేర్చారు. తర్వాత- వాటి నుంచి ‘వై’ క్రోమోజోంను తొలగించారు. ఆ స్థానంలో మరో ‘ఎక్స్’ క్రోమోజోంను ప్రవేశపెట్టారు. ఆ కణాలు అండాలుగా తయారయ్యేలా చేశారు. అనంతరం ఈ అండాలను మరో ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు. ఈ విధానంలో మొత్తం 600 పిండాలు ఏర్పడ్డాయి. వాటిని సరోగేట్ ఎలుకలో ప్రవేశపెట్టగా.. అది ఏడు ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. అవి ఆరోగ్యంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పురుష అండాలను ఉపయోగించి ఓ బలమైన క్షీరదాన్ని సృష్టించడం ఇదే మొదటిసారి అని క్యుషు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాంకేతికంగా ఇద్దరు బయెలాజికల్గా ఫాదర్స్ నుంచి ఎలుకను సృష్టించారు. రెండు మగ ఎలుకల కణాల నుంచి అండాలను సృష్టించడం ఇదే మొదటి సారి. మానవ కణాలపైనా ఈ తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడం రాబోయే పదేళ్లలో సాధ్యం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!