
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఒక అడల్ట్ వెబ్‌సైట్‌లో తనతో పాటు ఇతర మహిళల ఫొటోలను మార్పింగ్ చేసి ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను అసహ్యకరమైనది అని అభివర్ణించారు. నేరస్థులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫికా అనే వెబ్‌సైట్‌కు 700,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, మెలోని, ఆమె సోదరి అరియానా, ఇటాలియన్ ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ ష్లీన్ మార్ఫింగ్ ఫోటోలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, పబ్లిక్ సోర్సెస్ నుండి అనుమతి లేకుండా తీసిన ఈ చిత్రాలు, మహిళలను లైంగికంగా వేధించేందుకు ఉపయోగిస్తున్నారు.
ఇలాంటి చర్యలు అసహ్యకరమైనవి అని మెలోని అన్నారు. బాధితులైన మహిళలందరికీ నా సంఘీభావం, మద్దతు ఉంటుందన్నారు. డిజిటల్ దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆమె మరింత హెచ్చరించారు.
సెంటర్-లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ సభ్యులతో సహా అనేక మంది మహిళల నుండి అధికారిక ఫిర్యాదులు అందిన తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చాలా వరకు మార్చబడిన ఫోటోలు సైట్ ప్రత్యేకమైన VIP విభాగంలో కనుగొన్నారు. ఈ సంఘటన తర్వాత చాలా మంది మహిళలు ఫికా, ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఫిర్యాదులు చేశారు. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పురుషులు అనుమతి లేకుండా మహిళల సన్నిహిత ఫోటోలను పంచుకున్నారు, ఇది ఆన్‌లైన్ లింగ ఆధారిత దుర్వినియోగం విస్తృత సమస్యను ఎత్తి చూపిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి