జెరూసలెంలో మౌంట్ హోలీ టెంపుల్ తిరిగి తెరుచుకున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు తొలి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఆదివారం వరుసగా మూడవ రోజు కూడా కొనసాగింది. తమ పవిత్ర స్థలం యూదులకు తెరిచిన మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేవని పేర్కొన్నారు. ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు ప్రకటించారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య 11 రోజుల యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్‌లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం మొదలైందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యుల తరఫున శనివారం ఒక ప్రకటనలో హింస ఫలితంగా పౌరుల ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం ప్రకటించారు. పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐక్యరాజ్యసమితి స్పష్టంచేసింది.