Israel – Iran Conflict: ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కమాండర్‌తో సహా 15 మంది సైనికులు హతం..!

|

Oct 02, 2024 | 10:12 PM

ఇజ్రాయెల్, హిజాబుల్లా మధ్య వివాదం మధ్య లెబనాన్‌లో ఇజ్రాయెల్ కమాండర్‌తో సహా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో తమ కమాండర్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Israel - Iran Conflict: ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కమాండర్‌తో సహా 15 మంది సైనికులు హతం..!
Israel Iran Conflict
Follow us on

మిడిల్‌ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ చేరుకోని ప్రాంతం లేదు. ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేసిందంటే దాని అంతు చూడందే వదలదు. అలాంటి ఇజ్రాయెల్‌కు నాలుగు గంటల పాటు ఊపిరాడకుండా చేసింది ఇరాన్. యుద్ధ ఎత్తుల్లో ఇజ్రాయెల్ టెక్నిక్స్ వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటిది ఏకంగా ఇరాన్ దాడులే చేసింది.

ఇజ్రాయెల్, హిజాబుల్లా మధ్య వివాదం మధ్య లెబనాన్‌లో ఇజ్రాయెల్ కమాండర్‌తో సహా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం (అక్టోబర్ 2) లెబనాన్‌లో తమ కమాండర్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్‌లోకి చొరబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించిన మొదటి యుద్ధ సంబంధిత మరణం ఇది. వార్తా ఏజెన్సీలు ‘రాయిటర్స్’ కథనం ప్రకారం, మరణించిన వ్యక్తిని 22 ఏళ్ల కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్‌గా గుర్తించారు. అతను ‘ఇగోస్ యూనిట్’లో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్ వర్గాల ద్వారా ‘స్కై న్యూస్ అరేబియా’కు సమాచారం అందించింది. అయితే, హిజ్బుల్లా, ఇరాన్‌లకు వ్యతిరేకంగా తన ప్రచారంతో ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ నూతన సంవత్సరం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. “ఇది విజయోత్సవ సంవత్సరం అవుతుంది” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు.

మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. “భవిష్యత్తులో ఇజ్రాయెల్‌పై దాడి చేయవద్దు. ఇరాన్ దాడులు చేయకుండా ప్రాక్సీ ఉగ్రవాద సంస్థలను ఆపాలి. మధ్యప్రాచ్యంలోని ప్రయోజనాలను, భద్రతా దళాలను రక్షించడంలో అమెరికా వెనుకాడదు. ఇజ్రాయెల్‌ను రక్షించడానికి అమెరికా కట్టుబడి ఉంది” అని అమెరికా నిర్మొహమాటంగా చెప్పింది.

ఇంతలో, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ కుట్ర గురించి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హెచ్చరించినట్లు ‘రాయిటర్స్’ తమ కథనంో పేర్కొంది. ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం, హిజ్బుల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ దాడిలో చంపడానికి కొన్ని రోజుల ముందు లెబనాన్ నుండి పారిపోవాలని అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించినట్లు తెలిసింది. ప్రస్తుతం, టెహ్రాన్‌లోని సీనియర్ ప్రభుత్వ ర్యాంక్‌లలో ఇజ్రాయెల్ చొరబాటు గురించి అయతుల్లా అలీ ఖమేనీ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..