Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి.. ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం చేసిన యూఎన్ ఏజెన్సీ!

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని అత్యంత రహస్యమైన భూగర్భ ప్రాంతమైన నాటాంజ్ అణు సముదాయంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి అణు సంస్థ (IAEA) మంగళవారం తెలిపింది.

Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి.. ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం చేసిన యూఎన్ ఏజెన్సీ!
Natanz Underground

Updated on: Jun 18, 2025 | 12:12 AM

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని అత్యంత రహస్యమైన భూగర్భ ప్రాంతమైన నాటాంజ్ అణు సముదాయంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి అణు సంస్థ (IAEA) మంగళవారం తెలిపింది. అయితే ఈ అణు కేంద్రం భూమి లోతులో ఉండటం వల్ల దీన్ని లక్ష్యంగా చేసుకోవడం కష్టమని మొదట భావించారు, కానీ IAEA డేటా ప్రకారం, ఇజ్రాయెల్ నాటాంజ్ యురేనియం సుసంపన్న కర్మాగారం భూగర్భ విభాగాన్ని ప్రత్యక్షంగా దెబ్బతీసినట్టు తెలిపింది.

అయితే ఇరాన్‌లోని అను సముదాయాలను లక్షంగా చేసుకొని ఇజ్రాయోల్ చేసిన దాడుల తర్వాత వెలువడిన హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా, నాటాంజ్ భూగర్భ సుసంపన్న కేంద్రంపై దెబ్బతిన్నట్టు IAEA గుర్తించింది. మరోవైపు ఇరాన్‌లోని ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాల వద్ద ఎలాంటి నష్టం జరగలేదని IAEA స్పష్టం చేసింది.

IAEA ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాలు, గ్రౌండ్ సమాచారం ఆధారంగా పరిస్థితిని అంచనా వేస్తోంది, ఎందుకంటే ఘర్షణల కారణంగా అధికారులు నేరుగా స్థలాన్ని పరిశీలించలేకపోయారు. గతంలో ఈ కాంప్లెక్స్‌లోని భూగర్భ కేంద్రం దెబ్బతిన్నట్లు IAEA ధృవీకరించింది. శుక్రవారం దాడిలో విద్యుత్ సరఫరా నష్టం వల్ల సెంట్రిఫ్యూజ్‌లు దెబ్బతిన్నాయని IAEA చీఫ్ రాఫెల్ గ్రాస్సీ సోమవారం తెలిపారు. ఫోర్డో అణు కేంద్రంలో మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని ఆయన తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..