
హమాస్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. దక్షిణ గాజాలోని పాలస్తీనీయులంతా తక్షణమే పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. గాజాలోనే అతిపెద్దదైన ‘అల్-షిఫా’ ఆస్పత్రి కూడా ఖాళీ అవుతోంది. అక్కడ తలదాచుకుంటున్న వందలాది మంది పౌరులతో పాటు రోగులు, వైద్య సిబ్బంది వేరే చోటికి తరలివెళ్లినట్లు గాజా ఆరోగ్య విభాగం వర్గాలు తెలిపాయి.
ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం తమకు ఆదేశించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాము అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. వేరేచోటికి వెళ్లాలని భావిస్తున్న వారికి సురక్షితమైన దారి కల్పిస్తామని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు.. గాజాలో కొన్ని చోట్ల ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. ఉత్తర గాజాపై హమాస్ నియంత్రణను కోల్పోయిందని.. ఈ నేపథ్యంలోనే స్వీయ భద్రత కోసం గాజా పౌరులను ఇతర ప్రాంతాలకు వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించింది.
🛑Al-Amal Hospital, and PRCS headquarters in Khan Younis, with no electricity or water since 6 days.#Gaza #SaveGazaHospitals #HumantarianAid #غزة#لست_هدفا#المساعدات pic.twitter.com/NpFL7VpZDR
— PRCS (@PalestineRCS) November 18, 2023
మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య జరుగుతున్న యుధాన్ని నిలిపేందుకు యుఎస్ ప్రయత్నిస్తోంది. ఇజ్రాయిల్ యుద్ధం ఆపడానికి ఒక ఒప్పదం జరిగినట్లు.. గాజాలో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ మహిళలు , పిల్లలను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరు పక్షాలు ఐదు రోజుల పాటు యుద్ధ విరామానికి అంగీకరించాలని యుఎస్ నిర్దేశిస్తుంది. ఈ సమయంలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఖైదీలను బృందాలుగా ప్రతి 24 గంటలకు ఒకసారి క్రమం తప్పకుండా విడుదల చేయాలనే కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో ఖైదీలను విడుదల చేయడం సాధ్యమవుతుంది. అయితే ఈ వార్త రాసే వరకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య అలాంటి ఒప్పందం జరగలేదని కొన్ని మీడియా కథనాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
బెంజమిన్ నెతన్యాహు పాలనకు వ్యతిరేకంగా బందీల కుటుంబాలు, స్థానిక ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 240 మంది ఇజ్రాయెల్ , విదేశీ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం 20 వేల మందికి పైగా ప్రజలు నెతన్యాహు కార్యాలయం వెలుపల ప్రదర్శించారు లైనంత త్వరగా బందీలను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇజ్రాయిల్ కాల్పులు విరమించనున్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేధించింది. అదే సమయంలో జో బిడెన్ పరిపాలన అధికారులు ఎటువంటి ఒప్పందం జరగలేదంటూ వెల్లడించారు.
కాల్పుల విరమణ వార్త వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, అయితే రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ , హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేసే వరకు ఇజ్రాయెల్-విదేశీ బందీలను విడుదల చేయబోమని హమాస్ కూడా చెబుతోంది. నెతన్యాహు పాలన దీనికి సిద్ధంగా ఉందని, అయితే ఖైదీలందరి విడుదలపై అంగీకరించడం లేదనే నివేదికలు వచ్చాయి.
కాగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రెండు కథనాలు రాశారు. ప్రత్యేక కథనంలో పెద్దన్న ఇజ్రాయెల్‌కు బహిరంగంగా తన మద్దతును మరోసారి ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఏ మేరకు సహాయం చేస్తుందో తెలియజేసింది. అమాయక ప్రజల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని మరో కథనంలో చెప్పారు. తన వ్యాసంలో వెస్ట్ బ్యాంక్ , గాజా ఏకీకరణ గురించి మాట్లాడారు. బలవంతంగా గాజా నుండి పాలస్తీనియన్లను తరిమికొట్టవద్దని ఆయన సూచించారు. యుద్ధం తర్వాత పాలస్తీనియన్ల ప్రయోజనాలను కాపాడాలని ఆయన అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..