
మిసైళ్లు.. ఘోరమైన బాంబులు… విధ్వంసక చిత్రాలు.. భ్రమ అనే సిరాతో లిఖించబడుతున్న మూడో ప్రపంచ యుద్ధ స్క్రిప్ట్‌లో భాగమా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు ఒకరినొకరు గందరగోళానికి గురిచేస్తున్నారు. రష్యా, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, వీటితోపాటు NATO… ప్రతి ఒక్కరూ.. మిగిలిన దేశాలను గందరగోళానికి గురిచేస్తుండడం.. పచ్చి అబద్ధమో.. భయానక నిజమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అందరూ గందరగతోళ ప్రకటనలు.. అందుకు విరుద్ధంగా వారి చేష్టలుంటున్నాయి. ముందుగా వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో నిర్ణయాత్మక యుద్ధం చేస్తున్నారు, కానీ ఆయన రక్షణ బడ్జెట్‌ను తగ్గిస్తానని కూడా చెబుతున్నారు. ఇది శాంతికి సంకేతమా… లేదా తెరవెనుక పెద్ద జరుగుతున్న గేమా? డొనాల్డ్ ట్రంప్ ప్రతి ప్రకటనా కొత్త పజిలే. ఈరోజు ఆయన ఒకటి చెబుతారు, రేపు దానికి విరుద్ధంగా చేస్తారు. ఇలా ప్రపంచం ఆ చట్రంలో చిక్కుకుపోతుంది. బెంజమిన్ నెతన్యాహు, కొన్నిసార్లు తాను ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేశానని చెబుతారు. ఇప్పుడు అదే నెతన్యాహు ఖమేనీ నుంచి యురేనియంను అడుగుతున్నానని ప్రకటన చేస్తారు. అణు బాంబు శాంతికి అవసరమని చెప్పిన ఆయతొల్లా అలీ ఖమేనీ… ఇప్పుడు దానిని ఎలాగైనా పొందాలనుకోవడం ఆయన లక్ష్యంగా మారింది. ఇక నాటో.. ట్రంప్‌ను యూరప్ శత్రువు అని పిలిచిన నాటో, ఇప్పుడు ఆయనను ‘డాడీ’ అని పిలుస్తోంది. మనం చెప్పుకుంటున్న పాత్రలన్నీ భిన్నమే అయినప్పటికీ.. వారంతా ఒకే స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. అది మరేదో కాదు.. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన స్క్రిప్ట్. ముందుగా, మాస్కోకు వెళ్దాం… అక్కడ...