ఉక్రేనియన్ విమాన ప్రమాద ఘటన.. మానవ తప్పిదమే.. ఇరాన్

ఇరాన్ విమానాశ్రయ సమీపంలో ఇటీవల కూలిపోయిన ఉక్రేనియన్ విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఇరాన్ అధికారిక టీవీ తెలిపింది. రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన అత్యంత కీలకమైన.. సైనిక స్థలానికి దగ్గరగా ఈ విమానం వెళ్ళిందని , అయితే ఉద్దేశపూర్వకంగా కాక.. అనుకోకుండా దీన్ని కూల్చివేయడం జరిగిందని సైనిక విభాగం కూడా స్పష్టం చేసింది. ఇది మానవ తప్పిదమేనని, ఇందుకు కారకులైన సంస్థలను సైనిక పరిధిలోని కోర్టులకు నివేదిస్తామని, అవే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని మిలిటరీ  […]

ఉక్రేనియన్ విమాన ప్రమాద ఘటన.. మానవ తప్పిదమే.. ఇరాన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2020 | 1:58 PM

ఇరాన్ విమానాశ్రయ సమీపంలో ఇటీవల కూలిపోయిన ఉక్రేనియన్ విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఇరాన్ అధికారిక టీవీ తెలిపింది. రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన అత్యంత కీలకమైన.. సైనిక స్థలానికి దగ్గరగా ఈ విమానం వెళ్ళిందని , అయితే ఉద్దేశపూర్వకంగా కాక.. అనుకోకుండా దీన్ని కూల్చివేయడం జరిగిందని సైనిక విభాగం కూడా స్పష్టం చేసింది. ఇది మానవ తప్పిదమేనని, ఇందుకు కారకులైన సంస్థలను సైనిక పరిధిలోని కోర్టులకు నివేదిస్తామని, అవే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని మిలిటరీ  అధికారులు పేర్కొన్నారు. ‘ అమెరికా దుస్సాహసం కారణంగా సంభవించిన డిజాస్టర్ ఇది ! అలాంటి సంక్షోభ సమయంలో మానవ తప్పిదం జరిగింది ‘అని విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ ట్వీట్ చేశారు. ‘ మా దేశ ప్రజలతో బాటు ఈ విమాన ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం..క్షమించమని కోరుతున్నాం ‘ అని ఆయన అన్నారు. ఉక్రేనియన్ విమానాన్ని ఇరాన్ దేశమే కూల్చివేసిందని ఆ మధ్య అమెరికా, కెనడా ఆరోపించాయి. అయితే తొలుత ఈ  ఆరోపణను ఇరాన్ తోసిపుచ్చింది. ఇప్పుడు తాను చేసింది ‘ పొరబాటే ‘ అన్నట్టు ప్రకటన చేసింది. ఆ విమాన ప్రమాదంలో మొత్తం 170 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.