మిడిల్‌ ఈస్ట్‌లో మహా యుద్ధం.. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌, ఎక్కడికి దారితీస్తుంది?

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాలు నువ్వా ? నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఇరాన్‌ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఆరుగురు టాప్‌ ఇరాన్‌ ఆర్మీ కమాండర్లను చంపేసింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది చనిపోయారని , దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది.

మిడిల్‌ ఈస్ట్‌లో మహా యుద్ధం.. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌, ఎక్కడికి దారితీస్తుంది?
Iran Israel War

Updated on: Jun 13, 2025 | 9:47 PM

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాలు నువ్వా ? నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఇరాన్‌ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఆరుగురు టాప్‌ ఇరాన్‌ ఆర్మీ కమాండర్లను చంపేసింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది చనిపోయారని , దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్దంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపుదాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికి ఉపయోగించుకోలేదని , అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకుంటే ఆ దేశాన్ని ఎవరు కాపాడాలేరని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఇజ్రాయెల్‌ దాడులను ట్రంప్‌ స్వాగతించారు. అయితే అమెరికా అండతోనే ఇజ్రాయెల్‌ రెచ్చిపోతోందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖొమేనీ హెచ్చరించారు. యుద్దాన్ని ఇజ్రాయెల్‌ ప్రారంభించిందని , తాము దానికి సరైన రీతిలో ముగింపు పలుకుతామన్నారు. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది చనిపోయినట్టు ఇరాన్‌ ప్రకటించింది. 329 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఇరాన్‌కు చెందిన ఆరుగురు టాప్‌ ఆర్మీ కమాండర్లు దాడిలో చనిపోయినట్టు తెలిపింది. అయితే ట్రంప్‌ తీరుపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో చర్చలను నిలిపివేస్తునట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ కూడా డ్రోన్‌ దాడులను ప్రారంభించింది. ఒకేసారి 800 డ్రోన్లను ఇరాన్‌ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌కు కౌంటర్‌గా ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ -3ని ఇరాన్‌ ప్రారంభించింది. అయితే చాలా ఇరాన్‌...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి