International Women’s Day 2021 : ప్రపంచ వ్యాప్తంగా మొదలైన మహిళాదినోత్సవ సంబరాలు.. దీని వెనుక ఓ మహిళ కృషి పట్టుదల ఉంది ఆమె ఎవరో తెలుసా..!

|

Mar 06, 2021 | 5:41 PM

మహిళలకు హక్కులపై అవగాహన కల్పిస్తూ జరుపుకునేఈ సంబరం వెనుక ఓ మహిళా పోరాటం ఉంది. ఓ కార్మిక ఉద్యమం ఉంది. స్త్రీలకు అన్నిరంగాల్లో...

International Womens Day 2021 : ప్రపంచ వ్యాప్తంగా మొదలైన మహిళాదినోత్సవ సంబరాలు.. దీని వెనుక ఓ మహిళ కృషి పట్టుదల ఉంది ఆమె ఎవరో తెలుసా..!
Follow us on

International Women’s Day 2021  : మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ పురుషులతో అన్నింటా సమానం మంటూ అంతర్జాతీయంగా రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఏటా నిర్వహిస్తుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటోంది. మార్చి 1 నుంచే సంబరాలు మొదలు అవ్వుతాయి.

అయితే మహిళలకు హక్కులపై అవగాహన కల్పిస్తూ జరుపుకునేఈ సంబరం వెనుక ఓ మహిళా పోరాటం ఉంది. ఓ కార్మిక ఉద్యమం ఉంది. స్త్రీలకు అన్నిరంగాల్లో సమానత కల్పించాలనే ఓ గొప్ప ఆలోచన ఉంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది.

ఆమె కార్లా జెట్కిన్.. మహిళల హక్కుల కోసం పోరాడిన కార్లా ఆలోచనకు ప్రతిఫలమే నేడు జరుపుకుంటున్న మహిళా దినోత్సవం. ‘క్లారా జెట్కిన్.. కోపెన్ హెగెన్‌‌‌‌ సిటీలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సు’లో ‘ఇంటర్నేషనల్ ఉమెన్ డే’ కోసం ప్రతిపాదన పెట్టారు. ఆ సదస్సుకు 17 దేశాలకు చెందిన వంద మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా క్లారా జెట్కిన్‌‌‌‌ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. అనంతరం మార్చి 19వ తేదీ 1911న తొలిసారిగా ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌‌‌‌ దేశాల్లో మహిళా దినోత్సవం జరిపారు. ఈ వేడుకల్లో పదిలక్షలమందిపైగా మహిళలు పాల్గొన్నారు.

ఇక అప్పటి నుంచి కొన్ని ఏళ్లపాటు వివిధ దేశాలు వివిధ తేదీల్లో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకునే వారు. 1917 యుద్ధం టైంలో రష్యా మహిళలు ‘ఆహారం…శాంతి’ అనే పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ తరువాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలజ్ జా-2 తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కు కల్పించింది. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మార్చి 8. అందుకే మార్చి 8న ఉమెన్స్ డే జరుపుకోవడం మొదలైంది.

అయితే 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవాన్ని అధికారికంగా జరపడం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్‌‌‌‌తో ఈ దినోత్సవాన్ని జరుపుతోంది. ఇక 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 110వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

Also Read:

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అయితే భూమి మీద 2030 నాటికి మహిళల సంఖ్య భూమిపై సగం సగం

అమెరికాలో కరోనా మహమ్మారికి ఏడాది పూర్తి.. ఉటా హెల్త్‌ యూనివర్సిటీలో పలు కీలక ఘట్టాలు..

 శరీరాన్ని వజ్రంలా ధృడంగా మార్చే ఆసనం.. దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసా..!