రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా నేడు అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవం

| Edited By: Subhash Goud

Jul 17, 2021 | 8:39 AM

 International Justice Day 2021: అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయ‌డ‌మే దీని..

రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా నేడు అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవం
International Justice Day 2021
Follow us on

International Justice Day 2021: అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయ‌డ‌మే దీని లక్ష్యం. ఇది అంతర్జాతీయ నేర విభాగంలో న్యాయాన్ని సైతం ప్రోత్సాహిస్తుంది. ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది.

చరిత్ర:

రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవంగా 1998లో నిర్ణయంచారు. అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, మారణహోమంలో బాధితులకు న్యాయం చేయడం వంటి వాటి ప్రాముఖ్యాన్ని ఈ రోజు సూచిస్తుంది. న్యాయంపై ప్రజలలో అవగాహన క‌ల్పించి ఐక్యంగా న్యాయం కోసం పోరాడేలా చేయడం. అలాగే బాధితుల హక్కులను సాధించ‌డం కోసం ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రజ‌లను ప్రోత్సాహిస్తుంది. అనేక నేరాల నుండి ప్రజలను రక్షిచడంతో పాటు దేశ శాంతి, భద్రత, శ్రేయస్సుకు భంగం క‌లిగించే వ్యక్తులకు హెచ్చరిక‌గా ప‌నిచేస్తుంది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్‌ జస్టిస్‌ దినోత్సవం అని కూడా పిలుస్తారు. దీనిని అంతర్జాతీయ క్రిమినల్‌ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకొంటారు. అంత‌ర్జాతీయ నేరాల‌కు న్యాయం జ‌రిగేలా చేయడం, అంత‌ర్జాతీయంగా జ‌రిగే క్రిమిన‌ల్ జ‌స్టిస్‌కు మ‌ద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ముఖ్య ఉద్దేశాలు. 1998 నుంచి సుమారు 139 దేశాలు కోర్టు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ప్రతినిధి అయిన దాదాపు 80 రాష్ట్రాలు దీనిని ఆమోదించాయి.

అన్యాయం జరుగకూడదన్నదే న్యాయవ్యవస్థ ఉద్దేశం

కాగా, సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నదే న్యాయస్థానం ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ రోజు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతారు.