Nasa – Subashini Iyer: నాసాలో పెరుగుతున్న భారతీయ ఇంజనీర్ల ప్రాధాన్యత.. సుభాషిణి అయ్యర్‌కు కీలక బాధ్యతలు

|

Jun 09, 2021 | 6:47 PM

నాసా చేపడుతున్న ప్రయోగాల్లో భారతీయ ఇంజనీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా నాసా చేపట్టిన జాబిల్లి ప్రయోగం ఆర్టెమిస్ లో ప్రవాస భారతీయ వనిత సుభాషిణీ అయ్యర్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Nasa - Subashini Iyer: నాసాలో పెరుగుతున్న భారతీయ ఇంజనీర్ల ప్రాధాన్యత.. సుభాషిణి అయ్యర్‌కు కీలక బాధ్యతలు
Subashini Iyer
Follow us on

నాసా చేపడుతున్న ప్రయోగాల్లో భారతీయ ఇంజనీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా నాసా చేపట్టిన జాబిల్లి ప్రయోగం ఆర్టెమిస్ లో ప్రవాస భారతీయ వనిత సుభాషిణీ అయ్యర్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో సుభాషిణీ అయ్యర్‌ జన్మించారు. 1992లో వీఎల్ బీ జానకిమెయ్యమయి కాలేజీ నుంచి సుభాషిణి.. మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అప్పట్లో ఆ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ సుభాషిణియే.  ఆర్టెమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లే కీలకమైన బోయింగ్ కోర్ స్టేజ్ ను సుభాషిణి అయ్యర్ డీల్ చేయనున్నారు. చంద్రుడి మీదకు మనుషులను చేరవేయడంతో పాటు..అక్కడి పరిస్థితులను క్షుణంగా అధ్యయనం చేయటం..మున్ముందు అంగారక గ్రహం మీదకు మనుషులను చేరవేసే విషయంపై అవగాహన ఏర్పరుచుకోవడం తమ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశ్యమని సుభాషిణీ అయ్యర్‌ తెలిపారు.

అర్టెమిస్‌ మిషన్‌ను నాసా మూడు దశలుగా చేపట్టనుంది. మొదటి దశ అర్టెమిస్‌-1లో సిబ్బంది లేకుండా ఉంటుంది. అర్టెమిస్‌-2లో చంద్రుడిని చుట్టి వచ్చేలా డిజైన్‌ చేశారు. 2024లో చేపట్టబోయే చివరి దశ అర్టెమిస్‌-3లో చంద్రమండలం మీదకు వ్యోమగాములు చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రతీ సంవత్సరం వ్యోమగాములను నాసా క్రమం తప్పకుండా చంద్రమండలానికి పంపనుంది. 1969లోనే చంద్రమండలానికి నాసా మనుషులను పంపింది.

నాసాలో కీలక పదవుల్లో పలువురు భారతీయులు

1994లో కల్పనాచావ్లాను వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. 1997లో అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళగా కల్పనా రికార్డు సృష్టించింది. 1998లో భారత్‌కు నుంచి ఎంపికైన రెండవ వ్యోమగామి సునితా విలియమ్స్. మార్స్ నావిగేషన్ హెడ్‌గా భారత సంతతికి చెందిన స్వాతి మోహన్ పనిచేస్తున్నారు. ఆర్టెమిస్‌ టీమ్‌లో సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన రాజాచారి పనిచేస్తున్నారు. నాసాలో సీనియర్‌ సైంటిస్టులుగా పనిచేస్తున్నా ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వారు అనితా సేన్‌ గుప్తా, మియ్య మియప్పన్‌, అశ్విన్‌ వాసవాడ, కమలేష్‌ లుల్లా తదితరులు పనిచేస్తున్నారు.

Also Read..మీరు బంగారం అమ్మేయాలని అనుకుంటున్నారా..? ఇవి తప్పకుండా గుర్తించుకోవాలి.. లేదంటే నష్టపోవాల్సిందే..!