Lottery: అదృష్టం అంటే అతడిదే.. యూఏఈలో లాటరీతో రూ.24 కోట్లు గెలుచుకున్న భారతీయుడు..

|

Mar 05, 2021 | 4:09 PM

Indian wins 24crore lottery in UAE: అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కోట్లాది మంది ఆశావహుల తపన కూడా ఆ లాటరీ కోసమే. ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా.. తమ బతుకులు..

Lottery: అదృష్టం అంటే అతడిదే.. యూఏఈలో లాటరీతో రూ.24 కోట్లు గెలుచుకున్న భారతీయుడు..
Indian wins 24crore lottery in UAE
Follow us on

Indian wins 24crore lottery in UAE: అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కోట్లాది మంది ఆశావహుల తపన కూడా ఆ లాటరీ కోసమే. ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా.. తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ.. ఏళ్లుగా చాలా మంది లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడో ఓ సారి అలాంటి వారికి జాక్‌పాట్ తగులుతుంటుంది. భారతీయులు చాలా మంది వారు వారు ఉన్న ప్రదేశాల్లో లాటరీలు కొనుగోలు చేస్తుంటారు. యూఏఈలో ఉన్న కొంతమంది భారతీయులు ఇప్పటికే పలు లాటరీల విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో మరో భారతీయుడికి కూడా ఆ అదృష్టం వరించింది. యూఏఈలో ఉంటున్న ఓ భారతీయుడు భారీ మొత్తంలో నగదును గెలుచుకున్నాడు. ఏకంగా మొత్తం 12 మిలియన్ల దిర్హమ్‌లు సొంతం చేసుకున్నాడు. అంటే మన కరెన్సీలో మొత్తం రూ.24 కోట్లుపైనే..

కర్ణాటకలో శివమొగ్గ జిల్లాకు చెందిన శివమూర్తి కృష్ణప్ప యూఈఏ లాటరీలో విజేతగా నిలిచాడు. మెకానికల్‌ ఇంజనీర్‌‌ అయిన శివమూర్తి గత 15 ఏళ్లుగా యూఏఈలోనే నివాసముంటున్నాడు. ఆయన కొనుగోలు చేసిన 202511 టిక్కెట్‌కు లాటరీ తగిలింది. ఫిబ్రవరి 17న జరిగిన డ్రాలో భారతీయుడు శివమూర్తి కృష్ణప్ప విజేతగా నిలిచినట్టు గల్ఫ్‌ న్యూస్‌ గురువారం వెల్లడించింది. లాటరీలో విజేతగా నిలిచినందుకు కృష్ణప్పతోపాటు.. ఆయన కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది.

ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులు లైవ్ ఏర్పాటు చేశారు. శివమూర్తికి ఫోన్ చేసి విజేతగా నిలిచినట్టు చెప్పారు. ఈ సందర్భంగా శివమూర్తి కృష్ణప్ప మాట్లాడుతూ.. తనకు కనమ్మశక్యంగా లేదని వివరించారు. గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నానని.. కానీ ఇంతవరకు తనకు అదృష్టం వరించలేదని పేర్కొన్నాడు. ఈ సారి లాటరీ నిర్వాహాకులు ప్రత్యేక ఆఫర్ ఇవ్వడంతో తాను రెండు టిక్కెట్లు కొనుగోలు చేసినట్టు వివరించాడు. ఈ మొత్తంతో తన స్వగ్రామంలో తన కుటుంబానికి ఒక పెద్ద ఇల్లు నిర్మించాలనుకుంటున్నానని శివమూర్తి పేర్కొన్నాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్‌ కోసం ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేస్తానని తెలిపాడు.

Also Read:

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!