Viral Video: గాల్లో ఫ్లైట్.. తోటి ప్రయాణికుడిపై భారత సంతతి వ్యక్తి దాడి.. చివరకు..

విమానంలో తోటి ప్రయాణికుడిపై భారత సంతతి వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి మియామికి వెళ్తున్న ఫ్లైట్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది. ఫ్లైట్ ఎయిర్ పోర్టులో దిగగ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Viral Video: గాల్లో ఫ్లైట్.. తోటి ప్రయాణికుడిపై భారత సంతతి వ్యక్తి దాడి.. చివరకు..
Indian Origin Man

Updated on: Jul 04, 2025 | 11:31 AM

ఓ విమానం అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి మియామికి వెళ్తుంది. ఆ ఫ్లైట్ లో భారత సంతతికి చెందిన ఇషాన్ శర్మ ప్రయాణిస్తున్నాడు. అయితే విమానంలో అతడు చేసిన పనికి కటకటాలపాలయ్యాడు. అసలేం జరిగిందంటే.. జూన్ 30న ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇషాన్ శర్మ ప్రయాణించాడు. విమానం గాల్లో ఉండగా ఇషాన్ గట్టిగా నవ్వుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన అతడి ముందు సీట్లో ఉన్న ఎవాన్స్ భయాందోళన చెందాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడని కంగారుపడి క్యాబిన్ సిబ్బందిని పిలిచే బటన్ ప్రెస్ చేశాడు. ఇది గమనించిన ఇషాన్ ఎవాన్స్ పై దాడికి పాల్పడ్డాడు. అతడి గొంతు పట్టుకుని కొట్టాడు. అటు ఎవాన్స్ సైతం తిరిగి ఇషాన్ పై దాడి చేశాడు. దీంతో విమానంలో పెద్ద గొడవ మొదలైంది.

ఎవాన్స్ చేసిన దాడిలో శర్మ ముఖంపై గాయాలయ్యాయి. ఆ తర్వాత శర్మ.. నన్నే కొడతావా.. నిన్ను చంపేస్తానంటూ ఎవాన్స్ ను బెదిరించాడు. దీంతో ఎవాన్స్ సిబ్బందికి చెప్పగా.. మరోసారి అలా చేస్తే చెప్పాలని కోరారు. అయినా శర్మ మాత్రం తన బెదిరింపులను కొనసాగించాడని ఎవాన్స్ వాపోయాడు.అయితే ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శర్మను పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే తన క్లైయింట్ ధ్యానం చేస్తున్నాడని.. దురరదృష్టవశాత్తు అది తన వెనక సీట్లో ఉన్న వ్యక్తికి నచ్చలేదని కోర్టులో శర్మ లాయర్ వాదించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..