Iran Vs Pak War: పాక్‎పై ఇరాన్ దాడికి స్పందించిన భారత్.. కీలక వ్యాఖ్యలు చేసిన విదేశాంగ కార్యదర్శి..

పాకిస్థాన్ పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మంగళవారం బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడటంపై భారత్ స్పందించింది. ఈ దాడులను ఇండియా పరోక్షంగా సమర్థించింది. ఇది పూర్తిగా ఇరాన్‌, పాకిస్థాన్‎ల అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్‌ జైస్వాల్. ఈ సందర్భంగా మరోసారి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారు.

Iran Vs Pak War: పాక్‎పై ఇరాన్ దాడికి స్పందించిన భారత్.. కీలక వ్యాఖ్యలు చేసిన విదేశాంగ కార్యదర్శి..
Indian Foreign Secretary Randhir Jaiswal
Follow us

|

Updated on: Jan 18, 2024 | 10:14 AM

పాకిస్థాన్ పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మంగళవారం బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడటంపై భారత్ స్పందించింది. ఈ దాడులను ఇండియా పరోక్షంగా సమర్థించింది. ఇది పూర్తిగా ఇరాన్‌, పాకిస్థాన్‎ల అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్‌ జైస్వాల్. ఈ సందర్భంగా మరోసారి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారు. భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాద చర్యల్ని సహించబోదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదని తేల్చి చెప్పారు. 2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే.. బలూచిస్తాన్‎లోని పలు ప్రాంతాల్లో జైష్‌ అల్‌ అదిల్‌కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దాడులనంతరం కీలక ప్రకటన చేసింది ఇరాన్. తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించింది. దీనిని పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది పాకిస్తాన్. భవిష్యత్తులో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఇరాన్ రాయబారిని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాక్‌ గగనతలాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. ఒక వేళ తాము మీ భూ భాగంలోకి వచ్చి ఉంటే.. ఇరు దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకుని, సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపింది పాక్. “ఉగ్రవాదం అన్ని దేశాలకూ తీవ్ర ముప్పు తలపెడుతుంది. దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించడం లేదని పేర్కొంది పాక్. ద్వైపాక్షిక బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా మీ చర్యలున్నాయి” అని ఇరాన్‌పై పాక్‌ మండిపడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..