మనదేశంతో పాటు ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకునే దేశాలు ఇవే.. 

15 August 2024

TV9 Telugu

Pic credit -  Social Media

భారతదేశం ఆగస్టు 15వ తేదీ 2024న తన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. అయితే మనదేశంతో పాటు మరికొన్ని దేశాలు కూడా తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నాయి.

 ఆగస్టు 15వ తేదీ 

పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ ద్వీప దేశం ఆగస్టు 15, 1971న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. అయినప్పటికీ.. వీరు తమ జాతీయ దినోత్సవాన్ని డిసెంబర్ 16న జరుపుకుంటారు.

బహ్రెయిన్

ప్రపంచంలోని అతి చిన్న, సంపన్న దేశాలలో ఒకటి. లీచ్టెన్‌స్టెయిన్ 1866లో జర్మన్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఆగస్టు 15న ఈ దేశం జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

లిచెన్‌స్టెయిన్

1945లో 35 ఏళ్ల సుదీర్ఘ జపనీస్ వలస పాలన నుండి విముక్తి పొందిన తర్వాత దక్షిణ కొరియా ఆగష్టు 15న గ్వాంగ్‌బోక్‌జియోల్‌ విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

దక్షిణ కొరియా

తన పొరుగుదేశం వలె ఉత్తర కొరియా జపాన్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆగష్టు 15న చోగుఖేబాంగ్'యిల్ లేదా లిబరేషన్ ఆఫ్ ది ఫాదర్‌ల్యాండ్ డేని జరుపుకుంటుంది.

ఉత్తర కొరియా

కాంగో జాతీయ దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటుంది. ఇది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1960లో 80 సంవత్సరాల ఫ్రెంచ్ వలస పాలన నుండి విముక్తి పొందిన రోజును సూచిస్తుంది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో