పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కోసం.. స్టట్‌గార్ట్‌లో ప్రవాస భారతీయుల శాంతియుత ర్యాలీ

భారత్‌లోని పహల్గం‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయకులు మరణించిన సంగతి తెలిసిందే. వారికి నివాళులు అర్పిస్తూ.. 2025, మే 4న ప్రవాస భారతీయులు 'Bharatiya Parivar BW' పేరిట జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో శాంతియుత సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం..

పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కోసం.. స్టట్‌గార్ట్‌లో ప్రవాస భారతీయుల శాంతియుత ర్యాలీ
Solidarity March

Updated on: May 05, 2025 | 8:57 AM

భారత్‌లోని పహల్గం‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయకులు మరణించిన సంగతి తెలిసిందే. వారికి నివాళులు అర్పిస్తూ.. 2025, మే 4న ప్రవాస భారతీయులు ‘Bharatiya Parivar BW’ పేరిట జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో శాంతియుత సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు జరగ్గా.. 300 మందికి పైగా ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభమయ్యే ముందు సభ్యులందరూ నుదిటిపై తిలకం పెట్టుకున్నారు. దానిని సాంస్కృతిక ఐక్యతకు, నివాళికి నిదర్శనానికి గుర్తుగా చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో హిందీ, ఆంగ్ల భాషలలో ప్రసంగాలు.. శాంతి పథ్, బాధితుల జ్ఞాపకార్ధం రెండు నిమిషాల మౌనం పాటించడం వంటివి జరిగాయి. అలాగే సాముహికంగా హనుమాన్ చాలీసా పారాయణం పటించారు హాజరైన సభ్యులు. ఇది ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించడమే కాకుండా.. హాజరైన వారందరిలో ధైర్యం, విశ్వాసం, ఐక్యతను ప్రేరేపిస్తుందని భావించారు. అనంతరం “హమ్ హోంగే కామ్యబ్”(మనం అధిగమిస్తాం), భారత జాతీయ గీతాన్ని పాడగా.. సాయంత్రం 5:30 గంటలకు గ్రూప్ ఫోటో తీసుకుని.. సెంట్రల్ స్టట్‌గార్ట్ గుండా దాదాపు 1 కిలోమీటరు మేర శాంతి కవాతును జరిపారు. కాగా, ఈ కవాతులో పాల్గొన్నవారందరికీ.. ఈవెంట్ నిర్వాహకులు కృతఙ్ఞతలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది.