నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్త్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్‌వీ సి56 రాకెట్‌ను ప్రయోగించి విజయవంతం చేశారు. ఇందులో సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి విజయవంతం చేశారు శాస్త్రవేత్తలు. అయితే మొత్తం నాలుగు దశల్లో ప్రయోగాన్ని పూర్తి చేశారు. వాణిజ్యానికి సంబంధించిన ఈ ఉగప్రహాలను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది.
ఈ పీఎస్‌ఎల్‌వీ సి-56 ప్రయోగం విజయవంతంపై సింగపూర్ ట్విట్ చేశారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తమ ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడంతో భారత్-సింగపూర్ అంతరిక్ష భాగస్వామ్యంతో మరో మైలు రాయిగా నిలిచిందని సింగపూర్ ట్విట్ చేసింది. ఇంజనీరింగ్ మధ్య భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహాల ప్రయోగం వల్ల సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇస్రో ప్రయోగం సక్సెస్ పై సింగపూర్ అభినందించింది. అయితే అంతరిక్షంలోకి దూసుకెళ్లిన 7 సింగపూర్ ఉపగ్రహాలు – ప్రైమరీ శాటిలైట్ DS-SAR, 6 సహ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలో చేరాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆదివారం తెలిపారు. ఈ విజయవంతంపై సింగపూర్ ట్విట్ చేశారు.
🇮🇳🇸🇬India-Singapore space partnership 🤝 marks another milestone with the launch🚀 of 7 Singaporean satellites🛰️ by Indian space agency ISRO today. Here is a thread (1/7)-@isro @NSIL_India @SGinIndia https://t.co/qsbKoporsp
— India in Singapore (@IndiainSingapor) July 30, 2023
ప్రయోగం తర్వాత సింగపూర్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఏజెన్సీలు ఈ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తాయని ఇస్రో తెలిపింది. ఈ మిషన్‌తో మన విశ్వసనీయ రాకెట్ PSLV 58వ ప్రయోగమని ఇస్రో తెలిపింది. రాడార్ మ్యాపింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ DS-SAR. ఈ మిషన్‌కు సంబంధించి సింగపూర్‌కు చెందిన DS-SAR ఉపగ్రహం DSTA బరువు 360 కిలోలు. ఇది సింగపూర్‌తో భారతదేశ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి