పాక్‌పై భారత్ ప్రతీకార దాడి ఆ రోజేనా.? ఆ దేశ మాజీ హైకమిషనర్‌ సంచలన ట్వీట్..

పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు చేసేదెప్పుడు? ఈ విషయంలో మన దేశంలో కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ ఇంట్రస్ట్‌ కనిపిస్తోంది. దాడులపై ప్రధాని మోదీ ముహూర్తం ఫిక్స్‌ చేయకున్నా, పాకిస్తాన్‌లో మాత్రం ఈ ముహూర్తాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి

పాక్‌పై భారత్ ప్రతీకార దాడి ఆ రోజేనా.? ఆ దేశ మాజీ హైకమిషనర్‌ సంచలన ట్వీట్..
India Pakistan War

Updated on: May 06, 2025 | 12:30 PM

పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు చేసేదెప్పుడు? ఈ విషయంలో మన దేశంలో కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ ఇంట్రస్ట్‌ కనిపిస్తోంది. దాడులపై ప్రధాని మోదీ ముహూర్తం ఫిక్స్‌ చేయకున్నా, పాకిస్తాన్‌లో మాత్రం ఈ ముహూర్తాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాక్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ Xలో ఒక పోస్ట్‌ పెట్టారు. రష్యా విక్టరీ పరేడ్‌ తర్వాత భారత్‌ తమపై దాడులు చేయవచ్చునన్నారాయన. 10, 11 తేదీల్లో భారత్‌ ఈ దాడులు చేసే అవకాశం ఉందన్నారు బాసిత్‌. భారత్‌ పరిమిత స్థాయిలో దాడులు చేయవచ్చంటూ బాసిత్‌ ట్వీట్‌ చేశారు.

ఇప్పటికే పాక్‌ ప్రధాని, రక్షణమంత్రితోపాటు, పలువురు మంత్రులు ఇదే పాట పాడుతున్నారు. రష్యాలో ఉన్న పాక్‌ రాయబారి కూడా భారత్‌ దాడులు చేస్తుందని చెప్పారు. అంటే, భారత్‌ దాడులు చేస్తుందని పాకిస్తాన్‌ భయపడుతోంది. కానీ పహల్గామ్‌ పాపాలకు మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదు. పహల్గామ్‌ దాడులతో తమకు సంబంధం లేదంటూనే, భారత్‌పై దాడిచేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు పాక్‌ నేతలు. ఈ పరిస్థితుల్లో దాడులకు ముహూర్తం ఏంటో పాక్‌ మాజీ హైకమిషర్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.