ఇండియా, చైనాలు వేస్తున్న చెత్త మా దేశంలో.. ట్రంప్

ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలు తమ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి చేస్తున్నదేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ దేశాల్లో పారిశ్రామిక కర్మాగారాలు కాలుష్యంతో నిండిపోయినా వాటిని శుద్ది చేయడానికి ఆ దేశాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని, అవి సముద్రంలో వేస్తున్న చెత్తా చెదారాలు లాస్ ఏంజిలిస్ లో తేలుతున్నాయని అన్నారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది అతి జటిలమైన సమస్య అంటూ ఆయన.. ఎలా చూసినా.. తనను తాను మంచి పర్యావరణవేత్తగా అభివర్ణించుకున్నారు. ‘ […]

ఇండియా, చైనాలు వేస్తున్న చెత్త మా దేశంలో.. ట్రంప్
Pardhasaradhi Peri

|

Nov 13, 2019 | 5:26 PM

ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలు తమ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి చేస్తున్నదేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ దేశాల్లో పారిశ్రామిక కర్మాగారాలు కాలుష్యంతో నిండిపోయినా వాటిని శుద్ది చేయడానికి ఆ దేశాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని, అవి సముద్రంలో వేస్తున్న చెత్తా చెదారాలు లాస్ ఏంజిలిస్ లో తేలుతున్నాయని అన్నారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది అతి జటిలమైన సమస్య అంటూ ఆయన.. ఎలా చూసినా.. తనను తాను మంచి పర్యావరణవేత్తగా అభివర్ణించుకున్నారు. ‘ మీరు నమ్మండి.. నమ్మకపోండి ‘ అన్నారు. ‘ నేను పరిశుధ్ధ వాతావరణంలో ఉన్నాను.. అయితే ఈ భూతలం మీద స్వచ్ఛమైన గాలిని కూడా కోరుతున్నాను.. అలాగే నీటిని కూడా ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్యారిస్ ఒప్పందం నుంచి తమ దేశం వైదొలగిందని చెబుతూ.. అది హారిబుల్ గా ఉందన్నారు. మూడేళ్ళలో మీరు మీ బిజినెస్ లను మూసేయండి.. మనకేమీ ఎలాంటి ఎనర్జీ అక్కర్లేదు అని న్యూయార్క్ లో జరిగిన ఎకనమిక్ క్లబ్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. అసలు ఆ ఒప్పందం కారణంగా అమెరికన్ ఉద్యోగాలకు గండి పడిందన్నారు. మనకు స్వచ్ఛమైన గాలి, నీరు కావాలని, మన దేశంలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఈ వనరులు ఇప్పుడు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. 2015 లో ప్యారిస్ లో కుదిరిన ఒప్పందంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని మోదీ కీలక పాత్ర వహించారు. క్లైమేట్ ఛేంజ్ పై వారు ప్రతిపాదించిన తీర్మానాన్ని పలు దేశాలు ఆమోదించాయి. అయితే ఈ ఒప్పందం నుంచి తాము వైదొలగుతామని ట్రంప్ 2017 జూన్ లో ప్రకటించినప్పటికీ.. ఇందుకు సంబంధించి ప్రక్రియ నవంబర్ 4 నుంచి మొదలైంది. వచ్ఛే ఏడాది నవంబరు 4 నాటికి ఆ దేశం దీని నుంచి పూర్తిగా వైదొలగుతుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu