ఆఫ్ఘానిస్తాన్ నుంచి తిరిగి రాగోరుతున్న ఆఫ్ఘన్ల కోసం కొత్త కేటగిరీ ఎలెక్ట్రానిక్ వీసాల నుంచి..ఫాస్ట్ ట్రాక్ దరఖాస్తుల వరకు వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన వీసా కేటగిరీని ఈ-ఎమర్జెన్సీ ఎక్స్..మిక్స్ వీసా’ గా పరిగణించనున్నారు. కాబూల్ లోని ప్రస్తుత పరిస్థితిని తాము పరిశీలిస్తున్నామని, ఇండియాకు రాగోరుతున్న ఆఫ్ఘన్ల ప్రవేశానికి చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేక వీసాల ద్వారా వారు ఇండియాలోకి ప్రవేశించవచ్చునన్నారు. అటు-కాబూల్ లోని భారత రాయబారిని, ఎంబసీ సిబ్బందిని తీసుకు వచ్చేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం కాబూల్ బయల్దేరింది. కాబూల్ విమానాశ్రయంలో నిన్నటితో పోలిస్తే మంగళవారం రద్దీ కొంతవరకు తగ్గిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అక్కడక్కడా కాల్పుల శబ్దం తప్ప నగర వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నట్టు వెల్లడించింది.చాలామంది తమ ఇళ్లకు తిరిగి వెళ్లారని పేర్కొంది. నిన్న జరిగిన తొక్కిసలాటలో ఓ జంట తమ 7 నెలల పసిపాపను కోల్పోయింది. కాబూల్ లోని భారతీయుల తరలింపు విషయమై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ సులీవాన్ తో ఫోన్ లో మాట్లాడారు. భారతీయుల తరలింపులో తాము సహకరిస్తామని అమెరికన్ అధికారులు తెలిపినట్టు సమాచారం.
కాగా కాబూల్ నుంచి హిందువులు, సిక్కుల తరలింపునకు ప్రాధాన్యమిస్తామని భారత ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వారు తమ ఎంబసీతో టచ్ లో ఉండాలని సూచించింది. ఈ దౌత్య కార్యాలయంలో స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది ఉన్నారు. కాగా ఆఫ్ఘన్ శరణార్థులకు అమెరికా అధ్యకక్షుడు జోబైడెన్ 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. ఆఫ్ఘన్ విషయంలో తన ప్రభుత్వం అనుసరించిన పాలసీపై ప్రత్యర్థులు చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.