
యుగాంతం ఎప్పుడు వస్తుంది.. ఇదో నెవర్ ఎండింగ్ స్టోరీలా మారిపోయింది. అప్పుడెప్పుడో 2012లో యుగాంతం అంటూ చాలా వార్తల కథానలు, విశ్లేషణలు వచ్చాయి. దానిపై ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. అయితే.. తాజాగా భూమిని ఓ గ్రహశకలం ఢీ కొట్టే అవకాశం ఉందంటూ నాసా ప్రకటించడంతో మరో సారి ఈ యుగాంతం గురించి చర్చ మొదలైంది. 2032లో భూమిని 300 ఫీట్ల వ్యాపార్థం ఉన్న ఓ భారీ గ్రహ శకలం ఢీ కొట్టే ఛాన్స్ ఉందని, అది కనుక భూమిని ఢీ కొంటే భారీ విలయం తప్పదంటూ ప్రచారం జరుగుతంది. ఆ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టే ఛాన్స్ కేవలం 2.3 శాతమే అని, దాని కక్ష్యను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. అయినా కూడా యుగాంతానికి టైమ్ వచ్చేసిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గొప్ప భౌతిక శాస్త్రవేత్త, గురత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన సర్ ఇస్సాక్ న్యూటన్ కూడా యుగాంతం గురించి ఎప్పుడో చెప్పేశాడంటూ, దానికి సంబంధించిన లేఖ కూడా ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. 1704వ సంవత్సరంలో ఒక లేఖలో ప్రపంచం 2060లో ఉనికిలో లేకుండా పోతుందని న్యూటన్ పేర్కొన్నాడు. భూమి అంతం అవుతుందనే అంచనాను బైబిల్ ప్రొటెస్టంట్ వివరణ, బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు, ముఖ్యంగా ఆర్మగెడాన్ యుద్ధం ఆధారంగా న్యూటన్ రూపొందించినట్లు తెలుస్తోంది. “భూమి ఉనికిని కోల్పోతుంది కానీ, చాలా మంది చెబుతున్నట్లు అంత త్వరగా అంతం అయ్యేందుకు నాకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు” అని న్యూటన్ పేర్కొన్నాడు. అయితే.. యుగాంతంపై అప్పట్లో ఉన్న అసత్య ప్రచారాలను, ఊహాజనిత వ్యక్తుల అంచనాలను తప్పు అని నిరూపించేందుకే భూమి అంతం ఎప్పుడనే విషయంపై పరిశోధన జరిపి 2060లో భూమి ఉనికి కోల్పోవచ్చని న్యూటన్ అంచనా వేశాడు.
డేనియల్ అండ్ రివిలేషన్స్ పుస్తకంలో 1260, 1290, 2300 రోజుల సంఖ్యను ఉపయోగించి సంవత్సరాన్ని నిర్ణయించాడు. ఇవి అపోకలిప్స్‌లోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు లేదా ప్రారంభాన్ని సూచిస్తాయి. అయితే, అతను ఈ రోజులను సంవత్సరాలుగా అర్థం చేసుకున్నాడు. దాంతో 800 ADని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించాడు. అది రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. 1,260 సంవత్సరాల తర్వాత ప్రపంచం రీసెట్ అవుతుందని అతను లెక్కించాడు. ఈ లెక్క 1260, 800 కలిపితే.. 2060. సో 2060లో ఈ భూమి ఉనికి ముగిస్తుందని న్యూటన్ అంచనా వేశాడు. న్యూటన్ మాత్రమే ఇటువంటి డూమ్స్‌డే అంచనాలను చేయలేదు. 1500 లలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్, 2025 లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని అంచనా వేశాడు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి