Corona Vaccine : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలిస్తున్నారు. వ్యాక్సిన్లను తరలించేందుకు ప్రత్యేకమైన ‘ఎయిర్ ఫ్రైట్ కారిడార్’ను ఏర్పాటు చేసారు. ఈ మేరకు వ్యాక్సిన్ల సరఫరా ఒప్పందంపై జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సంతకాలు చేశాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో గ్లోబల్ హబ్ అయిన హైదరాబాద్, గ్లోబల్ ఎయిర్ కార్గో హబ్ అయిన దుబాయ్‌ల ప్రత్యేక భాగస్వామ్యంలో సరఫరా నిర్వహించనున్నారు. దీంతో వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతులు, దేశీయ పంపిణీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌కార్గో కేంద్రంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అవతరించిందని విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు.
భారత్ నుంచి తయారయ్యే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్, హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్ కుమార్, కమర్షియల్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ఈవీపీ యూజీన్ బారీ కలిసి ఒక వర్చువల్ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కరోనా టీకాలను తయారీ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు చేర్చడం, అక్కడి నుంచి హబ్ లాజిస్టిక్స్‌లోకి అటు నుంచి నేరుగా ఎండ్ కస్టమర్లకు వ్యాక్సిన్ల డెలివరీని క్రమబద్ధీకరించనున్నారు.
ALSO READ : Gold Price Increased: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాములు ఎంతంటే..