ఇంగ్లండ్ లోని ఎస్సెక్స్ లో ‘ ఎ 127 ‘ పేరిట నిర్వహించిన వెరైటీ హార్స్ రేసులో ఓ అనుకోని ప్రమాదమే జరిగింది. రెండు గుర్రాల మీద ఇద్దరు వ్యక్తులు దూసుకుపోతుండగా.. ఓ గుర్రం అదుపు తప్పి ఓ మెటల్ రైలింగ్ అవతల తలకిందులుగా పడిపోయింది. దాంతో బాటు దాన్ని అదిలిస్తున్న వ్యక్తి కూడా పడిపోయాడని వేరే చెప్పాలా ? ఈ రేసు వెనుకే వస్తున్న మూడు కార్లు కొంత దూరంలో ఆగిపోయాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తికీ, గుర్రానికీ ఏమైందో తెలియదు గానీ ఈ వీడియో చూసినవారు రకరకాలుగా స్పందించారు. అసలు ఈ రేసే తలతిక్కగా ఉందని కొందరు అంటే.. అయ్యో పాపం.. ఆ అశ్వానికీ, ఆ మనిషికీ ఏమీ కాలేదు కదా అని బోలెడంతమంది జాలిపడిపోయారు. ఎలాంటి రక్షణా లేని బల్లల్లాంటివాటిని తాళ్లతో ఆ గుర్రాలకు కట్టి నిర్వహించిన ఈ రేసు ఇలా నవ్వులపాలయింది.