H-1B Visa : H-1B వీసాల్లో భారీ మార్పులు.. అమెరికా కొత్త రూల్ ఇదే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, ఐటీ ఉద్యోగులకు ఇది అతి ముఖ్యమైన వార్త. ఎందుకంటే H-1B వీసా లాటరీ సిస్టమ్‌లో అమెరికా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. 2027 సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఇంతకు ట్రంప్ సర్కార్ తెచ్చి ఆ కొత్త మార్పులు ఏంటో చూద్దాం పదండి.

H-1B Visa : H-1B వీసాల్లో భారీ మార్పులు.. అమెరికా కొత్త రూల్ ఇదే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
H 1b Visa

Edited By:

Updated on: Dec 25, 2025 | 12:06 PM

ఉద్యోగం కోసమో, లేదా పైచదువుల కోసం, లేదా తమ వాళ్లను చూడ్డానికని తరచూ అనేక మంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశం నుంచి ఎక్కువ మంది అమెరికాకు వెళ్తుంటారు. అయితే ఇకపై అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, ఐటీ ఉద్యోగులకు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే H-1B వీసా లాటరీ సిస్టమ్‌లో అమెరికా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇన్నాళ్లూ H-1B వీసా రావాలంటే పూర్తిగా ‘లక్’ మీద ఆధారపడిన లాటరీ సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం.. ఎవరికైతే ఎక్కువ జీతం ఆఫర్ ఉంటుందో, వారికే వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.

లాటరీలో వెయిటేజీ సిస్టమ్

అమెరికా ప్రభుత్వం H-1B అప్లికేషన్లను 4 వేజ్ లెవెల్స్ గా విభజించింది. మీ జీతం ఏ లెవెల్‌లో ఉంటే, అన్ని సార్లు మీ పేరు లాటరీలో ఉంటుంది. లెవెల్ 4 (హై శాలరీ/ ఎక్స్‌పర్ట్స్): వీరికి లాటరీలో 4 సార్లు ఎంట్రీ ఉంటుంది. అంటే వీసా వచ్చే ఛాన్స్ 100% పెరిగినట్లే. లెవెల్ 3 (సీనియర్స్): వీరికి 3 సార్లు ఎంట్రీ ఉంటుంది. ​లెవెల్ 2 (మిడ్ లెవెల్): వీరికి 2 సార్లు ఎంట్రీ ఉంటుంది. లెవెల్ 1 (ఫ్రెషర్స్/ ఎంట్రీ లెవెల్) వీరికి కేవలం 1 ఎంట్రీ మాత్రమే ఉంటుంది. అంటే వీసా రావడం కొంచెం కష్టమే.

ఇండియన్స్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

అమెరికా ఇచ్చే H-1B వీసాల్లో 70-75 శాతం మన ఇండియన్సే తీసుకుంటారు. ఎక్కువ అనుభవం ఉండి, హై ప్యాకేజీలు తీసుకునే సీనియర్ ఇంజనీర్లకు ఇది పండగే. వీరికి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కానీ తక్కువ జీతానికి వెళ్లే ఫ్రెషర్స్, జూనియర్లకు కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. వీరికి వీసా వచ్చే అవకాశాలు దాదాపు 48% తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

​అమెరికా ఎందుకిలా చేస్తోంది?

కేవలం తక్కువ జీతాలకు పని చేయించుకోవడానికి కంపెనీలు H-1B ని వాడుకోకూడదు.. నిజమైన స్కిల్స్, హై టాలెంట్ ఉన్నవారికే అమెరికాలో ఛాన్స్ ఇవ్వాలన్నది ఈ కొత్త రూల్ ఉద్దేశం. అందుకే అమెరికా కేవలం అనుభవం ఉన్న హై ప్యాకెజ్ ఉన్న వారికి మాత్రమే వీసా ఇచ్చే అవకాశాన్ని పెంచింది.

​నకిలీ కంపెనీలకు చెక్:

ఇకపై రిజిస్ట్రేషన్ టైంలోనే జీతం వివరాలు, జాబ్ రోల్ పక్కాగా చెప్పాలి. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టినా, జీతం తక్కువ ఇచ్చినా వీసాను వెంటనే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.

మొత్తానికి అమెరికా ఏం చెప్తోందంటే.. “మీ దగ్గర స్కిల్ ఉండి, ఎక్కువ జీతం ఆఫర్ ఉంటేనే రండి.. తక్కువ జీతాలకు రావొద్దు” అని క్లియర్‌గా సిగ్నల్ ఇచ్చింది. ఈ రూల్స్ 2027 ఆర్థిక సంవత్సరం (FY2027) నుంచి అమల్లోకి వస్తాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.