పాక్‌‌లో పేట్రేగిన మత విద్వేషం..గురునాన‌క్ ప్యాలెస్ ధ్వంసం

| Edited By:

May 28, 2019 | 3:10 PM

పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ గురునానక్ ప్యాలస్‌ను కొందరు దుండగులు కూల్చివేశారు. ఈ ఘటన న్యూ లాహోర్‌ రోడ్డుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌరోల్ పట్టణం వద్ద జరిగింది. ఈ గురునానక్ ప్యాలస్ అద్భుత క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు ప్ర‌తి ఏడాది వేలాది మంది సిక్కులు దీనిని సందర్శిస్తారు. అయితే దుండగులు ఈ ప్యాలస్‌ను ధ్వంసం చేసి ఇందులో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను అమ్ముకున్న‌ట్లు కూడా తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఈ ప్యాలస్ ఉంది. దీంట్లో సిక్కు […]

పాక్‌‌లో పేట్రేగిన మత విద్వేషం..గురునాన‌క్ ప్యాలెస్ ధ్వంసం
Follow us on

పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ గురునానక్ ప్యాలస్‌ను కొందరు దుండగులు కూల్చివేశారు. ఈ ఘటన న్యూ లాహోర్‌ రోడ్డుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌరోల్ పట్టణం వద్ద జరిగింది. ఈ గురునానక్ ప్యాలస్ అద్భుత క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు ప్ర‌తి ఏడాది వేలాది మంది సిక్కులు దీనిని సందర్శిస్తారు. అయితే దుండగులు ఈ ప్యాలస్‌ను ధ్వంసం చేసి ఇందులో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను అమ్ముకున్న‌ట్లు కూడా తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఈ ప్యాలస్ ఉంది. దీంట్లో సిక్కు మ‌త వ్య‌వ‌స్థాప‌కుడు గురునాన‌క్‌తో పాటు కొంద‌రు హిందూ రాజుల చిత్రప‌టాలు ఉన్నాయి. దాదాపు నాలుగు శ‌తాబ్ధాల క్రితం ఆ భ‌వంతిని నిర్మించి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. లాహోర్‌కు సుమారు వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నౌరోల్ ప‌ట్ట‌ణం వ‌ద్ద గురునాన‌క్ ప్యాలెస్ ఉన్న‌ది. ప్యాలెస్‌లో సుమారు 16 భారీ సైజున్న రూమ్‌లు ఉన్నాయి. చారిత్ర‌క క‌ట్ట‌డాన్ని ధ్వంసం చేయ‌డాన్ని స్థానికులు త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధాని ఇమ్రాన్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.