British looted 500 carat Great Star of Africa diamond: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8, 2022 (గురువారం) కన్నుమూసిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటీష్ కిరీటంలో పొదిగిన వజ్రాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు మన దేశం నుంచి బ్రిటీష్ వాళ్లు తీసుకెళ్లిన అతి విలువైన కోహినూర్ వజ్రం మాత్రమే ఎలిజబెత్ కిరీటంలో ఉందని అనుకుంటున్నాం. ఐతే రాణి కిరీటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన 530.2 క్యారెట్ల పురాతన వజ్రం కూడా ఉందట. ఈ వజ్రాన్ని కల్లినన్ I లేదా గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. 1905లో గనుల తవ్వకాల్లో ఈ వజ్రం బయటపడింది. అప్పట్లో సౌత్ ఆఫ్రికా దేశాన్ని ఏలుతున్న వలస పాలకులు ఈ డైమండ్‌ను బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి అప్పగించారు. అది కాస్తా రాణి కిరీటంలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు దాన్ని తమ దేశానికి తిరిగి తెచ్చుకోవాలని ఆ దేశ ప్రజలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు తమ డైమండ్‌ను తిరిగి ఇస్తే సౌత్ ఆఫ్రికా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని దాదాపు 6000ల మంది సంతకాలు చేసిన ఆన్‌లైన్ పిటిషన్‌ను change.org వెబ్‌సైట్‌లో వేశారు. బ్రిటన్ తమ దేశం నుంచి దొంగిలించిన మొత్తం బంగారం, వజ్రాలు మొత్తం తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా డిమాండ్ చేస్తూ ట్వీట్ పోస్ట్ చేశాడు.