Viral News: నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ గురించి తెలియని వారుండరు. అనేక ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ కంపెనీలు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్‌లో చాలాసార్లు ఆధిపత్యం చెలాయించేది గూగుల్ మాత్రమే. యాహూ వంటి సెర్చ్ ఇంజన్ కంపెనీలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ మరో స్థాయికి చేరుకుంది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. లక్ష మందికి పైగా ఉద్యోగులున్న ఈ సంస్థ ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ లక్షల్లో వేతనాలు అందిస్తోంది.
ఎంతోమంది ఉద్యోగుల కలల కార్యాలయాలలో ఒకటి.. అందుకే ఈ కంపెనీలో పనిచేయాలన్నది చాలా మంది యువత కలల్లో ఒకటి అని చెప్పొచ్చు. యువ తరం కలల వర్క్‌ప్లేస్‌లో ఒకటైన గూగుల్ ఇప్పుడు మేకలకు ఉపాధి కల్పించింది. మనుషుల పనిని సులభతరం చేయడానికి రోబోలను ఉపయోగించడం గురించి మనం విన్నాము. అదేంటి… మేకలు? అని ఆశ్చర్యంగా ఉందికదూ..కానీ, ఇది కూడా నిజం… గూగుల్ కంపెనీలో మేకల పని ఏంటి మీ సందేహాలకు సవివరంగా వివరణ ఇస్తున్నాం..
గూగుల్ కంపెనీ అనేక ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని ప్రాంగణంలో చాలా వరకు పచ్చిక బయళ్ళు ఉన్నాయి. పచ్చిక బయళ్లను చక్కగా ఉంచేందుకు గూగుల్ 3,500 మేకలను అద్దెకు తీసుకుంది. పచ్చిక బయళ్లను సజావుగా నిర్వహించేందుకు దానిపై ఈ మేకలను మేపాలని నిర్ణయించుకున్నారు. USAలోని కాలిఫోర్నియాలో తన బహుళ ఎకరాల తోటలో పచ్చిక బయళ్లను నిర్వహించడానికి Google దాదాపు 3,500 గొర్రెలను నియమించుకుంది.
సహజ పర్యావరణం, గడ్డి అంతస్తులను మరమ్మతు చేయకుండా పెట్రోల్, డీజిల్‌తో నడిచే యంత్రాలను ఉపయోగించడం ద్వారా సహజ పర్యావరణనికి హాని కలుగుతుందని భావించిన గూగుల్..పర్యావరణాన్ని రక్షించడానికి ఈ ఇలాంటి చర్యలు చేపట్టింది. అయితే గూగుల్ తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి