Green Card: అమెరికాలో ఉంటోన్న భారతీయులకు పండగలాంటి వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌..

|

Sep 25, 2022 | 10:12 AM

Green Card: అగ్ర రాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం పొందడం ఎంతో మంది కల. ఒక్క భారతీయులే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల వాళ్లు అమెరికాలో సెటిల్‌ కావాలని కోరుకుంటారు. అమెరికాకు వలస వెళ్లిన వారికి..

Green Card: అమెరికాలో ఉంటోన్న భారతీయులకు పండగలాంటి వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌..
Green Card
Follow us on

Green Card: అగ్ర రాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం పొందడం ఎంతో మంది కల. ఒక్క భారతీయులే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల వాళ్లు అమెరికాలో సెటిల్‌ కావాలని కోరుకుంటారు. అమెరికాకు వలస వెళ్లిన వారికి అక్కడే శాశ్వత నివాసం పొందే అవకాశం దక్కాలంటే గ్రీన్‌కార్డ్‌ ఉండాలనే విషయం తెలిసిందే. అయితే ఈ కార్డు పొందడానికి చాలా పోటీ ఉంటుంది. ఏళ్ల నుంచి ఎంతో మంది దీనికి దరఖాస్తు చేసుకుంటారు. గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎదురు చూస్తుంటారు. దీంతో సహజంగానే గ్రీన్‌ కార్డ్ జారీల ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. అయితే తాజాగా అమెరికా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయం గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరటనిచ్చింది.

గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెసింగ్‌ చేయాలని, ఇప్పటివరకు ఉన్న మొత్తం పెండింగు దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్‌లోగా పరిష్కరించాలని అమెరికా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ నుంచి వచ్చిన సూచనలను శ్వేతసౌధం పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే అమెరికాలో నివాసం ఉంటున్న వేలాది వలస కుటంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఏషియన్‌ అమెరికన్లు, నేటివ్‌ హవాయియన్లు, పసిఫిక్‌ ఐలాండర్ల విషయంలో అధ్యక్షుడి సలహా మండలి ఈ సంవత్సరం మే నెలలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. మే 12న ఆమోదించి, అధ్యక్షుడికి ఆగస్టు 24న పంపిన ప్రతిపాదనల వివరాలను తాజాగా ఈ కమిషన్‌ విడుదల చేసింది.

ఇదిలా ఉంటే ప్రపంచాన్ని వణికించిన కరోనా ప్రభావం గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్పై కూడా పడింది. మొత్తం 2.26 లక్షల గ్రీన్‌కార్డులు అందుబాటులో ఉన్నా.. 2021 ఆర్థిక సంవత్సరంలో కేండా 65,452 కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులనే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేరుకుపోయినా గ్రీన్‌కార్డ్‌ పెండింగ్ అప్లికేషన్స్‌ను 2023 చివరికల్లా పూర్తి చేయాలని కమిషన్‌ సూచించింది. ఇందుకోసం వీసా ఇంటర్వ్యూలు, గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని 150 శాతం పెంచుకోవాలని కమిషన్‌ సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..