Esha NagiReddi: అమెరికాలో అథ్లెటిక్స్‌ విభాగంలో సత్తాచాటుతున్న తెలుగు యువతి..

|

Apr 28, 2022 | 12:33 PM

Indian American Esha NagiReddi: అథ్లెటిక్స్ పోటీల్లో భారత సంతతి యువతి దూసుకెళ్తోంది. అమెరికాలో జరిగిన ఎన్‌సీఏఏ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో సత్తాచాటింది. అమెరికాలో స్థిరపడిన

Esha NagiReddi: అమెరికాలో అథ్లెటిక్స్‌ విభాగంలో సత్తాచాటుతున్న తెలుగు యువతి..
Esha Nagireddi
Follow us on

Indian American Esha NagiReddi: అథ్లెటిక్స్ పోటీల్లో భారత సంతతి యువతి దూసుకెళ్తోంది. అమెరికాలో జరిగిన ఎన్‌సీఏఏ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో సత్తాచాటింది. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి శ్రీధర్ నాగిరెడ్డి కుమార్తె ఈషా నాగిరెడ్డి నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (NCAA) పోటీకి ఎంపికైంది. అక్రోబాటిక్స్ & టంబ్లింగ్ (జిమ్నాస్టిక్స్)లో NCAAలో పోటీపడిన మొదటి ఇండో అమెరికన్ ఈషానే కావడం విశేషం. దేశంలోని 50 జట్లలో టాప్ 8 జట్లు మాత్రమే ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ జట్లల్లో ఈషా నాగిరెడ్డి జట్టు కూడా చేరుకుందని తెలిపారు.

ఈ పోటీలతో ఈషా, కన్వర్స్ యూనివర్శిటీ జట్టు యూజీన్, ఒరెగాన్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించింది. Baylor Vs Converse మధ్య పోటీ ఈరోజు రాత్రి నుంచి జరగనున్నాయి. ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం కూడా జరగనుంది.

ఈ పోటీలను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగు వ్యక్తులు, భారతీయులు ఈషా & ఆమె బృందం గొప్ప విజయాన్ని సాధించి ఛాంపియన్‌షిప్‌తో ఇంటికి రావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని గ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Health Tips: పాలు-పుచ్చకాయ కలిపి తింటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Eye Care in Summer: వేసవిలో కంటి సమస్యలకు చెక్ పెట్టండిలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..